డబ్బు లేకపోతే అప్పు తీసుకుని ఖర్చు చేయాలి

by Chukka Sudharani |

తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘కార్మేని సెల్వం’ చిత్రంలో విలక్షణ నటులు సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

డబ్బు లేకపోతే అప్పు తీసుకుని ఖర్చు చేయాలి
X

దిశ, సినిమా: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘కార్మేని సెల్వం’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రంలో విలక్షణ నటులు సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆధునిక కాలానికి అనుసంధానమైన ఈ కథ ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మంచి ఆసక్తిని పెంచగా.. తాజాగా తెలుగు టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి’ అని సముద్రఖని వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన ఈ టీజర్‌లో అధిక ఖర్చులు, భారీ లోన్లు, క్రిప్టో పెట్టుబడులు, త్వరగా ధనవంతులు కావాలనే ఆశతో చేసే ప్రయత్నాలు, నేటి సమాజంలో డబ్బు పట్ల ఉన్న ఆలోచనలను చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. అలాగే.. ‘రిచ్ కావాలంటే రిచ్ మనిషిలా ఖర్చు చేయడం నేర్చుకోవాలి... డబ్బు లేకపోతే అప్పు తీసుకుని ఖర్చు చేయాలి’ అని సముద్రఖని చెప్పే డైలాగ్ హైలెట్‌గా నిలిచాయి. మొత్తంగా ఈ టీజర్ సినిమాపై ప్రేక్షకుల ఆసక్తిని పెంచే విధంగా ఉంది. కాగా.. ఈ మూవీ ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది.

Next Story