అది అలవాటుగా మారితే ఊరుకునే ప్రసక్తి లేదు.. రిలేషన్‌షిప్‌లో మోసం చేయడంపై రకుల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

జీవితం చాలా పెద్దది. ఎవరైనా పొరపాటున ఒక్కసారి ఆ తప్పు చేసి, దానికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెబితే క్షమించవచ్చు.

అది అలవాటుగా మారితే ఊరుకునే ప్రసక్తి లేదు.. రిలేషన్‌షిప్‌లో మోసం చేయడంపై రకుల్ కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్, జాకీ భగ్నానీ వైవాహిక జీవితం గత కొద్ది కాలంగా చర్చనీయాంశంగా మారుతోంది. గతంలో జాకీ తమ రిలేషన్‌షిప్‌ను సిట్యుయేషన్‌షిప్‌గా పిలవడం అందరినీ ఆశ్యర్యపరిచింది. దీంతో పలు పుకార్లు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే రకుల్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చి.. పుకార్లు చెక్ పెట్టింది. దీంతో అంతా సర్దుమనిగింది అనుకనే లోపే రకుల్ రిలేషన్‌షిప్‌లో మోసం చేస్తే క్షమించకూడదని చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా విడుదలైన ‘పతి పత్ని ఔర్ వో 2’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, ఆయుష్మాన్ ఖురానాలతో కలిసి ‘ది బాంబే జర్నీ’ యూట్యూబ్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంధాలలో నమ్మకద్రోహం గురించి చర్చ వచ్చింది.

రిలేషన్‌షిప్‌లో మోసం చేయడాన్ని అస్సలు అంగీకరించలేమని రకుల్ చెప్పింది. అయితే, చర్చ ముందుకు సాగుతున్నప్పుడు రకుల్ ఒక భిన్నమైన అభిప్రాయాన్ని పంచుకుంది. "జీవితం చాలా పెద్దది. ఎవరైనా పొరపాటున ఒక్కసారి ఆ తప్పు చేసి, దానికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెబితే క్షమించవచ్చు. కానీ, మోసం చేయడమే ఒక అలవాటుగా మారితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు అస్సలు క్షమించకూడదు. ఇది కేవలం నా సాధారణ అభిప్రాయం మాత్రమే, నా వ్యక్తిగత జీవితానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అలాగే ఇది నా భర్తకు కూడా వర్తించదు. దయచేసి తప్పుడు వార్తలు సృష్టించకండి" అని రకుల్ స్పష్టం చేసింది. గతంలో తన భర్త చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నట్లే తన అభిప్రాయంపై కూడా పుకార్లు సృష్టింస్తారని భావించిన రకుల్ తెలివిగా ఆన్సర్ ఇచ్చింది. ఇక దీనిపై సారా అలీ ఖాన్ స్పందిస్తూ.. తాను క్షమించగలనేమో కానీ, ఆ తప్పును ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story