సినిమా ప్లాప్ అయితే రెండు, మూడు నెలలు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతా: ఆమీర్ ఖాన్

by Chukka Sudharani |

సినిమా మన బిడ్డ లాంటిది. అది విజయం సాధించనప్పుడు, రిజెక్ట్ అయినప్పుడు చాలా బాధగా ఉంటుంది.

సినిమా ప్లాప్ అయితే రెండు, మూడు నెలలు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతా: ఆమీర్ ఖాన్
X

దిశ, సినిమా: ఆమిర్ ఖాన్ కొడుకు జువైద్ హీరోగా నటించిన చిత్రం ‘ఏక్ దిన్’. ఇందులో హీరోయిన్‌గా సాయిపల్లవి నటించింది. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమీర్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య వచ్చి కేవలం యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమీర్ ఖాన్ సినిమా విజయం సాధించకపోవడంపై ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు నేను రెండు మూడు నెలల పాటు డిప్రెషన్‌కు గురవుతాను. ఎందుకంటే సినిమా మన బిడ్డ లాంటిది. అది విజయం సాధించనప్పుడు, రిజెక్ట్ అయినప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ మన నుంచి వచ్చే ఒక మంచి కథ కోసం ఎదురుచూస్తారు. వారు మనపైన అభిమానంతో థియేటర్‌కు వెళ్తారు. కానీ ప్రేక్షకులు ఎప్పుడూ కావాలని ఒక చెడ్డ సినిమా చూడటానికి వెళ్లరు. ఒకవేళ మీకోసం వచ్చి వారు నిరాశ చెందితే.. అది కచ్చితంగా మీరు చేసిన తప్పే అవుతుంది’ అంటూ చెప్పుకొచాడు. అందుకే సినిమా సక్సెస్ అయితే ఎంత సంతోషంగా ఉంటుందో ఫెయిల్ అయితే అంతకన్నా ఎక్కువ బాధ పడతాం అంటూ ఆమిర్ ఖాన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story