Samantha: ఉత్తమ నటిగా ఐకానిక్ గోల్డ్ అవార్డు.. సమంత రియాక్షన్ ఇదే?

by Kodari Anjali |

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Samantha: ఉత్తమ నటిగా ఐకానిక్ గోల్డ్ అవార్డు.. సమంత రియాక్షన్ ఇదే?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఏమాయ చేశావే (Emaya cheśave) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం మంచి స్థాయిలో ఉంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan), సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu), సూర్య (Sūrya) వంటి హీరోల సరసన అవకాశాలు దక్కించుకుని.. తనలోని సత్తాను చాటింది. కేవలం సినిమాల్లోనే కాకుండా ఈ హీరోయిన్ వెబ్ సిరీస్‌ల్లో, ఐటెమ్ సాంగ్స్‌లో కూడా మెరిసింది. పుష్ప (Pushpa) మొదటి పార్ట్‌లో సామ్ వేసిన ఐటెమ్ స్టెప్పులు యువతను ఏ రేంజ్‌లో ఆకట్టుకున్నాయో స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

ఇకపోతే సమంత నటించిన సిటాడెల్ హనీ బన్నీ(Citadel Honey Bunny) వెబ్ సిరీస్‌కు తాజాగా ఐకానిక్ గోల్డ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఈ సిరీస్ దర్శకుడు నిన్న (ఫిబ్రవరి 19) సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ కృషి ఒక్కరిది కాదు.. టీమ్ అందరిది అని చెప్పుకొచ్చారు. అయితే సమంత అద్భుతమైన నటనకు ఉత్తమ నటిగా గుర్తించి అవార్డు అందించినందుకు తాజాగా సామ్ స్పందించింది. ఈ విషయాన్ని తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ వేదికన పంచుకుని.. అవార్డు గెలుచుకున్నందుకు థ్యాంక్యూ అని ఓ లవ్ సింబల్ కూడా జోడించింది. దీంతో ఫ్యాన్స్ సమంతకు కంగ్రాట్స్ అని తెలియజేస్తున్నారు.

Next Story