- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Allu Arjun: దేశంలో ఏ హీరో టచ్ చేయలేని రికార్డు సాధించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) నటించిన ‘పుష్ప 2 ’

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) నటించిన ‘పుష్ప 2 ’ ( Pushpa 2) మూవీ థియేటర్లలో దూసుకెళ్తుంది. ప్రస్తుతం, ఎక్కడ చూసిన ఈ పేరే వినబడుతోంది. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో రోజుకో రికార్డు బ్రేక్ చేస్తున్నాడు. 2017లో పుష్ప వన్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో రష్మిక మందన్న( Rashmika Mandanna) కథానాయికగా గా నటించింది. పుష్ప 1 మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే.
ఇప్పుడు పుష్ప పార్ట్ 1 మించి పార్ట్ 2 సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లా దూసుకుపోతుంది. రిలీజ్ అయిన ఫస్ట్ డే నే 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓపెనింగ్స్ తోనే కొత్త రికార్డు క్రియోట్ చేసిన ఈ మూవీ విడుదలైన మూడు రోజుల్లో రూ. 500 కోట్లకి పైగా వసూలు చేసింది. కేవలం ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, ఇతర భాషల్లో కూడా భారీ వసూళ్లను అందుకుంటుంది.తాజాగా, దేశంలో ఏ హీరో టచ్ చేయలేని రికార్డు అల్లు అర్జున్ సాధించాడు. అదేంటో ఇక్కడ చూద్దాం..
అయితే, పుష్ప 2 తో బన్నీ తన రికార్డు తానే బ్రేక్ చేసుకున్నాడు. పుష్ప 1 రిలీజ్ అయిన 50 రోజులు వసూలు చేసిన కలెక్షన్స్ ను పుష్ప 2 రెండు రోజుల్లోనే కలెక్ట్ చేసింది. పుష్ప వన్ 50 రోజుల్లో 365 కోట్లకి పైగా వసూలు చేస్తే.. పుష్ప 2 రెండు రోజుల్లోనే రూ. 449 కోట్లు కలెక్ట్ చేసి పుష్ప1 రికార్డు బ్రేక్ చేసింది.






