iBomma: పుష్ప 2 రిలీజ్ కంటే ముందే చూశాడు..ఏకంగా రూ. 70 వేల‌కు ?

by velandi.Saikiran |   (  Updated:2026-02-12 15:22:45  IST  )

ఐ బొమ్మ నిర్వాహకుడు రవి గురించి షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. కొత్త సినిమా రిలీజ్ కంటే వారం రోజుల ముందే, రవి అర్ధరాత్రి తన లాప్టాప్ లో చూసేవాడట.

iBomma: పుష్ప 2 రిలీజ్ కంటే ముందే చూశాడు..ఏకంగా రూ. 70 వేల‌కు ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: చిత్ర పరిశ్రమను షేక్ చేసిన ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఇటీవల కాలంలోనే అరెస్టయిన సంగతి తెలిసిందే. అతని భార్యకు విడాకులు ఇస్తున్న నేపథ్యంలో రవి అరెస్టు అయినట్లు కొంతమంది ప్రచారం చేస్తుంటే, పోలీసులే చాక చక్యంతో అతన్ని పట్టుకున్నారని మరి కొంతమంది అనుకుంటున్నారు. ఏదైతేనేం మొత్తానికి ఇండస్ట్రీకి ఊరట కలిగించేలా, రవిని బొక్కలో వేశారు పోలీసులు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఐ బొమ్మ నిర్వాహకుడు రవి గురించి షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. కొత్త సినిమా రిలీజ్ కంటే వారం రోజుల ముందే, రవి అర్ధరాత్రి తన లాప్టాప్ లో చూసేవాడట.

థియేటర్ లోకి ప్రింట్ వెళ్లకముందే సినిమాను తిలకించి, విదేశాల్లో ఉన్న కొన్ని కంపెనీలకు ఆ సినిమా డేటాను అమ్మేవాడట. అలా పుష్ప 2 సినిమాను కూడా వారం రోజుల ముందు చూసి ఎంజాయ్ చేశాడట. పుష్ప 2 సినిమాను విదేశాల‌కు అమ్మేసి, రూ.70 వేలు సంపాదించాడట. కానీ సినిమా రిలీజ్ అయిన రోజు మాత్రమే, ఐ బొమ్మ వెబ్సైట్ లో ఆ సినిమాను పెట్టేవాడట. ఒకరోజు ముందే ఆ సినిమాను వెబ్సైట్ లో పెడితే, దొరికిపోతానని భయంతో, రిలీజ్ అయిన సాయంత్రం అప్లోడ్ చేసేవాడట. తన తమ్ముడి కోసం కొనుగోలు చేసిన లాప్టాప్ లో అర్థరాత్రి ఆ సినిమాలు చూసేవాడని పోలీసులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్న ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు మాత్రం ఈ విషయం తెలియదట.

Next Story