- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు
పైరసీ సినిమాల వెబ్ సైట్ నిర్వాహకుడు రవికి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. పైరసీ కేసులో నవంబర్ 16న రవి అరెస్ట్ అయ్యారు. రవి సినిమాలను పైరసీ చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీకి వేల కోట్లు నష్టం జరిగినట్టు పోలీసులు గుర్తించారు.

దిశ, వెబ్ డెస్క్: పైరసీ సినిమాల వెబ్ సైట్ నిర్వాహకుడు రవికి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి రోజు సీపీఎస్ ఎదుట హాజరుకావాలని.. దేశం విడిచి వెళ్ళొద్దని స్పష్టం చేసింది. పాస్ పోర్టును పోలీసులకు అప్పగించాలని ఆదేశించింది. పైరసీ కేసులో నవంబర్ 16న రవి అరెస్ట్ అయ్యారు. రవి సినిమాలను పైరసీ చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీకి వేల కోట్లు నష్టం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా రవి కోట్ల రూపాయలు సంపాదించినట్టు గుర్తించారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో రవి దేశం విడిచిపారిపోయి అండమాన్ దీవుల్లోని ఐలాండ్ లో ఉంటున్నట్టు విచారణలో తేలింది.
అంతేకాకుండా అరెస్ట్ కు ముందు రవి పోలీసులకే సవాల్ విసరడంతో అతడిని హైదరాబాద్ లోనే అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ లో అరెస్ట్ చేసినప్పటి నుండి రవి బెయిల్ కోసం ప్రయత్నింనా ఫలితం దక్కలేదు. ఎట్టకేలకు అతడు జైలు నుండి విడుదల కాబోతున్నాడు. ఇక రవి అరెస్ట్ తరవాత చాలా మంది సోషల్ మీడియాలో మద్దతుగా నిలవడంతో హాట్ టాపిక్ గా మారింది. కొందరు రవిని హీరోతో పోల్చుతూ మాట్లాడారు. సినిమా టికెట్ ధరలు, థియేటర్లలో ఫుడ్, వాటర్ బాటిళ్ల ధరలు భారీగా పెరిగాయని తమకు రవినే హీరో అంటూ పొగడ్తలు కురిపించారు. ఇప్పుడు రవికి బెయిల్ రావడంపై వారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.






