నేను చెప్పను.. 'RC17' గురించి షాకింగ్ సమాధానం ఇచ్చిన సుకుమార్

by Pulgam srinivas |   (  Updated:2026-06-24 14:25:42  IST  )

'RC17' అప్డేట్ కోరిన అభిమానులకు సుకుమార్ "నేను చెప్పను... మీరే ఊహించుకోండి" అంటూ సస్పెన్స్ కొనసాగించారు.

నేను చెప్పను.. RC17 గురించి షాకింగ్ సమాధానం ఇచ్చిన సుకుమార్
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' సినిమా జూన్ 4న విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి చిత్ర బృందం 'మెగా బ్లాక్‌బస్టర్' పేరుతో సక్సెస్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రముఖ దర్శకులు సుకుమార్, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాను 'RC17' అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రకటించగా, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చాలా కాలం క్రితమే విడుదలైంది.

దీంతో ఈ సక్సెస్ ఈవెంట్‌లో సుకుమార్ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏదైనా అప్డేట్ ఇస్తారని మెగా అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూశాయి. ఇక ఈవెంట్‌లో సుకుమార్ ప్రసంగిస్తుండగా అభిమానులు 'RC17' అంటూ నినాదాలు చేశారు. దానికి స్పందించిన ఆయన, "అప్డేట్ అడుగుతున్నారు కదా... కానీ నేను చెప్పను. నాకు అలా చెప్పడం ఇష్టం ఉండదు. మీరే ఊహించుకోండి" అంటూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. దీంతో 'RC17'కు సంబంధించిన అప్డేట్‌ను ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story