- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై అలాంటి సినిమాలు అస్సలు చేయను… సంచలన వ్యాఖ్యలు చేసిన తరుణ్ భాస్కర్
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, నేను వరుసగా కామెడీ చిత్రాలు చేస్తున్నాను. ఇకపై సందీప్ రెడ్డి వంగా, ఆదిత్య ధర్, భరత్ కమ్మ మాదిరిగా బలమైన డ్రామా కలిగిన చిత్రాలను చేయాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకుడు మరియు నటుడు అయిన తరుణ్ భాస్కర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన పెళ్లి చూపులు చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాల తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వం చేయడం కంటే సినిమాల్లో నటించడంపై ఎక్కువ ఆసక్తి చూపించాడు. తాజాగా ఈయన గాయపడ్డ సింహం అనే చిత్రంలో హీరోగా నటించాడు. మే 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈ దర్శకుడు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, ప్రస్తుతానికి నేను కొన్ని ప్రాజెక్టులకు కమిట్ అయి ఉన్నాను. అవి దాదాపు వచ్చే రెండేళ్లలో పూర్తి అవుతాయి. నేను వరుసగా కామెడీ చిత్రాలు చేస్తూ వస్తున్నాను. ఇకపై నా రూట్ మార్చాలి అనుకుంటున్నాను. కామెడీ సినిమాలు కాకుండా సందీప్ రెడ్డి వంగా, ఆదిత్య ధర్, భరత్ కమ్మ మాదిరిగా బలమైన డ్రామా కలిగిన చిత్రాలను చేయాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం నేను కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసిన తర్వాత అదే పనిలో ఉంటానని ఈ దర్శకుడు తెలిపారు. తాజాగా తరుణ్ భాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.






