- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలాంటి దర్శకులతో మాత్రమే సినిమాలు చేస్తా.. రీఎంట్రీపై బాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్(Sonam Kapoor) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్(Sonam Kapoor) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ‘సావరియా’ చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె ఎన్నో హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ఇక వరుస సినిమాలతో కెరీర్ పీక్స్‌లో ఉండగానే తన ప్రియుడు, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాని(Anand Ahujani) పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే సినిమాల్లోనూ నటించింది. ఇక 2022లో ఓ బాబుకు జన్మనిచ్చింది. సోనమ్ కొడుకు పేరు వాయు. ఇక ఆ బాబు పుట్టిన తర్వాత 2023లో ‘బ్లైండ్’ (Blind)మూవీలో నటించిన ఆమె ఏడాది నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది.
పలు ఫ్యాషన్స్ షో, యాడ్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనమ్‌కు రీఎంట్రీపై ప్రశ్న ఎదురవగా షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘తల్లి అయ్యాక నేను పూర్తిగా మారిపోయాను. నా శరీర పరంగా, మానసికంగా అన్ని రకాలుగా మార్చేసింది. అసలు ముందు ఉన్న సోనమ్‌ను కాదనిపిస్తుంది. ప్రతి తల్లికి పిల్లలే మొదటి ప్రాధాన్యత. నాకూడా నా కొడుకు బాగోగులే ముఖ్యం. కాబట్టి సమయం ఉంటేనే సినిమాలు చేస్తాను. అది కూడా నన్ను సరదాగా పని చేసే దర్శకులతో మాత్రమే చేస్తాను.
ఒకప్పుడు ఇదే ఫాలో అయ్యాను. చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమాలు సెలెక్ట్ చేసుకునేదాన్ని. ఇప్పుడు కూడా అదే ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను. మనిషిగా మనం ఎదిగేలా చేసేవారితోనే పని చేస్తా. నచ్చకపోతే పనిచేయడం కష్టం. కథలు ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ప్రస్తుతం నా లైఫ్ బాగుంది. భర్త పిల్లలే నా ప్రపంచం’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోనమ్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా అయోమయంలో పడిపోయారు. అసలు సోనమ్ రీ ఎంట్రీ ఇస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.






