- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ అమూల్య క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.. కళ్లలో కన్నీళ్లు తిరిగాయంటూ యంగ్ బ్యూటీ ఎమోషనల్ పోస్ట్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar), త్రిష (trisha) కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar), త్రిష (trisha) కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అయితే ఇందులో అర్జున్ దాస్, ప్రియా ప్రకాష్ వారియర్(Priya Prakash Varrier) కూడా కీలక పాత్రలో కనిపించారు. అధిక్ రవిచంద్రన్(Adhik Ravichandran) దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ కామెడీ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవిశంకర్( Ravi Shankar ) యలమంచలి, నవీన్ ఎర్నేని నిర్మించారు. అయితే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’(Good Bad Ugly) చిత్రం ఏప్రిల్ 7న విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో నిత్యం ప్రియా ప్రకాష్ తను అజిత్‌తో నటించడంపై పలు ఎమోషనల్ పోస్టులు పెడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ఆయనతో నటించడంపై ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేసిన విషయం తెలిసిందే. అలాగే త్రిషపై కూడా ఓ పోస్ట్ పెట్టింది.
ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రియా ప్రకాష్ వారియర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అజిత్ కుమార్‌తో తన అంటీ, అంకుల్ వీడియో కాల్ మాట్లాడగా.. ఈ విషయాన్ని తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకున్నట్లు వెల్లడించింది. ‘‘ఈ అమూల్య క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అజిత్ సార్. ఇంత చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్పలేను. మాకు మా మామయ్యకు ఇది ప్రపంచం మొత్తం కంటే ఎక్కువ. మీ సినిమా థియేటర్స్‌లో ఎప్పుడూ మిస్ చేయలేదు మామయ్య. నాకు గర్తున్నప్పటి నుంచి మిమ్మల్ని ఆయన తెరపై చూస్తున్నారు. మా మామయ్య మిమ్మల్ని చూస్తున్నప్పుడు కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి’’ అని రాసుకొచ్చింది. అలాగే తాను ఏడుపు ముఖంతో ఉన్నాని దానిని విమర్శించకండి అని కోరింది. ప్రస్తుతం ప్రియా ప్రకాష్ పోస్ట్ వైరల్ అవుతుండటంతో.. అజిత్ అంటే ప్రియకే కాదు ఆమె ఫ్యామిలీకి కూడా పిచ్చి అని అర్థం అవుతోంది.






