- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏది ఏమైన నేను అతన్నే పెళ్లి చేసుకుంటా.. అనుష్క సంచలన కామెంట్స్.. షాక్‌లో ఫ్యాన్స్
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అనుష్క(Anushka) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అనుష్క(Anushka) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘సూపర్’(Super) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా నిలిచింది. అయితే ప్రజెంట్ ఈ అమ్మడు క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఘాటీ’(Ghati) సినిమాలో నటిస్తోంది. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. అనుష్క ప్రభాస్(Prabhas)తో డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతునే ఉంటాయి. అంతేకాకుండా వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి.
కానీ ఈ విషయాలను అనుష్క, ప్రభాస్ ఇద్దరూ ఖండించారు. అలా ఈ భామ మ్యారేజ్ గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా ఇంటర్వ్యూలో తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది అనుష్క. ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘బాహుబలి విడుదలైన తర్వాత నాపై పెళ్లి ఒత్తిడి ఎక్కువైంది. కుటుంబ సభ్యులే కాదు, మీడియా నుంచి కూడా ఇదే ప్రశ్న వస్తోంది. నాకు పెళ్లిపై పూర్తి నమ్మకం ఉంది.
సరైన వ్యక్తి, సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటా. ప్రేమ లేకుండా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నేను ప్రేమించే వ్యక్తినే వివాహం చేసుకుంటాను. నా తల్లిదండ్రులు ఈ విషయంలో నాకు మద్దతుగా ఉన్నారు. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని మాత్రం పెళ్లి చేసుకోను’ అని చెప్పుకొచ్చింది. అయితే ఇన్ని రోజులు ప్రభాస్‌ను చేసుకుంటుందని అనుకున్న ఫ్యాన్స్ అనుష్క ఇలా తేల్చి చెప్పడంతో వాళ్లు షాక్‌కు గురవుతున్నారు.






