రక్తం పంచుకుని పుట్టిన వాళ్లకంటే నాకు ఆ స్టార్ హీరోనే ఎక్కువ.. హాట్ టాపిక్‌గా మారిన మంచు విష్ణు

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-19 11:31:32  IST  )

మంచు విష్ణు(manchu vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ‘కన్నప్ప’(Kannappa) చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

రక్తం పంచుకుని పుట్టిన వాళ్లకంటే నాకు ఆ స్టార్ హీరోనే ఎక్కువ.. హాట్ టాపిక్‌గా మారిన మంచు విష్ణు
X

దిశ, సినిమా: మంచు విష్ణు(manchu vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ‘కన్నప్ప’(Kannappa) చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh)దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్, ప్రభాస్(Prabhas), మోహన్ లాల్(Mohanlal), మోహన్ బాబు వంటి స్టార్స్ నటిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 27న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. మంచు విష్ణు నెలరోజులముందే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ బిజీ బిజీగా మారిపోయారు. తాజాగా, ఓ పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న మంచు విష్ణు ప్రభాస్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘రక్తం పంచుకొని పుట్టినవాళ్లే ఈరోజు నా పతనం కోరుకుంటున్నారు. నేను ప్రభాస్ రక్తం పంచుకుని పుట్టకపోయినా నా మంచి కోరుకుంటున్నాడు. అందుకే ఎన్ని జన్మలకైనా అతనికి రుణపడి ఉంటాను. డార్లింగ్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఎంత గొప్ప నటుడో అతడికి కూడా తెలియదు. అలా చాలా తక్కువమంది ఉంటారు.

కెరీర్ ప్రారంభంలో సింపుల్‌గానే ఉంటారు.. కానీ డార్లింగ్ అంత పెద్ద స్టార్ అయినా ఇప్పటికీ అలాగే ఉంటాడు. మేము ఎప్పటికీ సోదరులమే’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, మంచు ఫ్యామిలీలో గత కొద్ది కాలంగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. మంచు మనోజ్, విష్ణు మధ్య ఆస్తి తగాదాలు జరుగుతుండగా.. అవి రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప సర్దుమనగడం లేదు. ఈ వివాదం కారణంగా మంచు మనోజ్ తన భార్య, కొడుకు, కూతురితో అందరికీ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతంలో మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై ఒరకు పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు. ఇక మంచు విష్ణు కూడా తమ్ముడితో దురుసుగానే ప్రవర్తించాడు. ఇక అప్పటినుంచి నిత్యం వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈనేపథ్యంలోనే విష్ణు ఈ కామెంట్లు చేయడంతో నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

Next Story