నా కుటుంబంతో గొడవపడి అందరినీ అవమానిస్తా.. ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్! (వీడియో)

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) రెండేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

నా కుటుంబంతో గొడవపడి అందరినీ అవమానిస్తా.. ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్! (వీడియో)
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) రెండేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’(Sitare Zameen Par'). ఆర్‌ఎస్ ప్రసన్న(RS Prasanna) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామాను కిరణ్ రావు నిర్మించారు. ఇక ఇందులో ఆమిర్ ఖాన్ సరసన జెనిలియా(Genelia) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా ఆమిర్ ఖాన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్‌గా నిలిచిన ‘తారే జమీన్ పర్’కు సీక్వెల్‌గా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 25న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు సమాచారం.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘సితారే సమీన్ పర్ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ కథ విషయానికొస్తే.. దివ్యాంగుల పైనే ఉంటుంది. ‘తారే జమీన్ పర్’ ప్రేక్షకులను ఏడిపించింది. కానీ ‘సితారే జమీన్ పర్’ సినిమా మాత్రం చాలా నవ్విస్తుంది. థీమ్ ఒక్కటే అయినప్పటికీ.. ప్రజలు రకరకాల మనస్తత్వాలు కలిగి ఉండేది చూపించాము. మొదటిభాగంలో నా పాత్ర నిక్కూ అతను చాలా సున్నితంగా ఉంటుంది.

కానీ ఇప్పుడు నా క్యారెక్టర్ గుల్షన్.. నిక్కూ పాత్రకు పూర్తి వ్యతిరేకంగా ఉంటాను. రాజకీయ నాయకులతో దురుసుగా ప్రవర్తిస్తాను. అలాగే కుటుంబసభ్యులతో గొడవపడి అందరినీ అవమానిస్తాను. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నా నేను మంచి వ్యక్తిగా ఎలా మారానే అనేది ‘సితారే జమీన్ పర్’ మూవీ స్టోరీ. మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. నిజంగా ఇది స్పానిష్ సినిమాలాగా ఉంటుంది. గుల్షన్ చాలా చెడ్డ వ్యక్తి. చాలా రూడ్‌గా ప్రవర్తిస్తాడు’’ అని చెప్పెకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story