- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎలాంటి పాత్రనైనా చేస్తాను.. ఆ స్టార్ హీరోయిన్ నాకు స్ఫూర్తి: ఆరతి గుప్తా
సంపూర్ణేష్ బాబు(Sampoonesh Babu), సంజోష్‌లు హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘సోదరా’.

దిశ, సినిమా: సంపూర్ణేష్ బాబు(Sampoonesh Babu), సంజోష్‌లు హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘సోదరా’. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో, అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తున్న ఈ చిత్రానికి మన్ మోహన్ మేనం పల్లి దర్శకుడు. క్యాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చంద్ర చగంలా నిర్మిస్తున్నారు. ఇందులో ఆరతి గుప్తా(Aarati Gupta) కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆరతి గుప్తా విలేకరులతో ముచ్చటించారు. ‘‘ఈ చిత్రం ట్రైలర్ లాంచ్‌లో నిర్మాత ఎస్‌కేఎన్ చెప్పిన మాటలను ప్రేరణగా తీసుకుని తెలుగు నేర్చుకుంటున్నాను. తెలుగు ఎంతో బ్యూటీఫుల్‌గా ఉంది.
ఇక్కడ స్థిరపడాలంటే తెలుగు నేర్చుకోవాలి. అప్పుడే నాకు కంఫర్ట్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లో ఎదో తెలియని ఎనర్జీ ఉంది. కామ్‌గా ఉంది. వెరీ మచ్ హోప్ ఫుల్ ఇక్కడ నేను బిజీ అవుతానని నమ్మకం ఉంది. సంపూ గురించి విన్నాను. అవుట్ ఆఫ్ ద బాక్స్ యాక్టర్ అని తెలుసు. సంపూకు ఉన్న ఫ్యాన్స్ బేస్ తెలుసు. ఆయన గత చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’ చూశాను. ఇంతకు ముందు ట్రెడిషినల్ పాత్రలు చేశాను. రియల్‌లైఫ్‌లో కూడా నేను సింపుల్ గర్ల్ నా వ్యక్తిత్వం అలానే ఉంటుంది.
నా వ్యక్తిత్వానికి దగ్గర ఉండే పాత్రను ఈ సినిమాలో చేశాను. అన్ని తరహా పాత్రలు, అన్నీ తరహా చిత్రాలు చేయాలని వుంది. అవసరమైతే ఎలాంటి పాత్రనైనా చేస్తాను. పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేయాలని ఉంది. బాగా యాక్ట్ చేయగలిగితే మనం అందంగా కనిపిస్తాం. ఒకవేళ అందంగా ఉండి యాక్ట్ చేయలేకపోయినా గ్లామర్‌గా కనిపించం. పర్‌ఫార్మన్స్ ఓరియెంటెడ్ సినిమాలకే నా మొదటి ప్రాధాన్యత. ఆలియా భట్(Alia Bhatt) అంటే నాకు చాలా ఇష్టం. ఆమె జర్నీ , చేసిన పాత్రలు నాలో ప్రేరణను నింపాయి. ఆలియా మూవీ సెలక్షన్ కూడా బాగుంటుంది. అల్లు అర్జున్(Allu Arjun) సినిమాలు చాలా ఇష్టం’’ అని చెప్పుకొచ్చింది.






