నేను ఆ టైంలో రెడ్ లైట్ ఏరియాకు వెళ్లాను.. యంగ్ హీరోయిన్ సంచలన కామెంట్స్

by Gugulothu.Kavitha |

శ్వేతా బసు ప్రసాద్ (Shweta Basu Prasad) ‘కొత్త బంగారు లోకం’ (Kotha Bangaru Lokam) సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది. వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం

నేను ఆ టైంలో రెడ్ లైట్ ఏరియాకు వెళ్లాను.. యంగ్ హీరోయిన్ సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: శ్వేతా బసు ప్రసాద్ (Shweta Basu Prasad) ‘కొత్త బంగారు లోకం’ (Kotha Bangaru Lokam) సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది. వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు. అప్పట్లో ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. అలా ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా ఈ సినిమా ఇచ్చినంత హిట్ ఏది ఇవ్వలేదు. అయితే కొన్నేళ్లు ఇండస్ట్రీకి కనిపించకుండా వెళ్ళిపోయిన ఈ అమ్మడు ప్రజెంట్ బాలీవుడ్‌లో వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది.

అలాగే సోషల్ మీడియాలోనూ శ్వేతా బసు ప్రసాద్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒకప్పుడు బరువు పెరిగి బొద్దుగా కనిపించే శ్వేత ఇప్పుడు బరువు తగ్గి.. సన్నజాజి తీగలా మారింది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్‌ను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేయడంలో అమ్మడు ముందు ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఆమె మాట్లాడుతూ.. ‘నేను లాక్ డౌన్ సమయంలో ‘ఇండియా లాక్ డౌన్’ అనే సినిమాలో నటించాను. అందులో వేశ్య పాత్రలో నటించాను. అయితే ఈ సినిమాలో భాగంగా ముంబైలోని రెడ్ లైట్ ప్రాంతంలో నివసించే మహిళలు లాక్ డౌన్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది స్వయంగా తెలుసుకోవడానికి.. నేను ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలోని కామాటిపురను సందర్శించాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story