నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సినిమాలు చూస్తాను.. సంయుక్త మీనన్

by Gugulothu.Kavitha |

శర్వానంద్‌(Sharwanandh) హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari).

నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సినిమాలు చూస్తాను.. సంయుక్త మీనన్
X

దిశ, వెబ్‌డెస్క్: శర్వానంద్‌(Sharwanandh) హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari). సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్‌(Samyukatha Menon), సాక్షి వైద్య(Sakshi Vaidhya) హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ సినిమా సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన హీరోయిన్ సంయుక్త వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది మాట్లాడుతూ.. ‘నేను ఒంటరిగా ఉన్నప్పుడు సిరీస్ చూస్తాను.

నెట్‌ఫ్లిక్స్ సిరీస్ అంటే నాకు చాలా ఇష్టం.. ఏదైనా సిరీస్‌ నచ్చితే అది అయిపోయే వరకు అలాగే చూస్తుంటాను. ఇక రీసెంట్‌గా వచ్చిన వెడ్‌నెస్ డే సిరీస్ నాకు బాగా నచ్చింది. అలా నచ్చినవి చూస్తుంటాను. అయితే ఫైటింగ్ సీన్స్, ఫీలింగ్స్ ఉండే సిరీస్ అంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story