ప్రభాస్ అలా బిహేవ్ చేయడం చూసి షాక్ అయ్యాను.. యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

‘బట్టం బోలే’(Battam bole) అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

ప్రభాస్ అలా బిహేవ్ చేయడం చూసి షాక్ అయ్యాను.. యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘బట్టం బోలే’(Battam bole) అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈ బ్యూటీ తన ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయిపోయింది. అలాగే తన నటనతో కూడా బాగా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీ కాంత్(Rajinikanth) సరసన ‘పేట’(Peta) మూవీలో నటించి మెప్పించింది. ఈ సినిమాతో ఈ భామ గ్రాఫ్ చేంజ్ అయిపోయిందని చెప్పవచ్చు. దీంతో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. అలా వచ్చిన అన్ని చిత్రాల్లో నటించింది.

ఆ తర్వాత కోలీవుడ్‌లోనూ స్టార్ హీరో సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే రీసెంట్‌గా ‘తంగలాన్’(Thangalan) సినిమాతో అలరించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇందులో భాగంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సరసన ‘రాజా సాబ్’(Raja Saab) సినిమాతో మన ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి(Maruti) దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో మాళవికతో పాటు ప్రభాస్‌తో నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ది కుమార్‌(Riddi Kumar)లు కూడా రొమాన్స్ చేయబోతున్నారు. సంజయ్ దత్(Sanjay Dutt), అనుపమ్ ఖేర్(anupam Kher) వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి తమన్(Thaman) సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో అదరహో అనిపిస్తుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ డార్లింగ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘ప్రభాస్‌ను సెట్‌లో చూసి షాకయ్యాను. అంద పెద్ద స్టార్ హీరో అయ్యుండి చాలా నార్మల్‌గా, సింపుల్‌గా, సపోర్టివ్‌గా ఉంటాడు. షూటింగ్ సెట్లో అందరితో సరదాగా మాట్లాడతాడు. టీం మొత్తానికి మంచి ఫుడ్ తెప్పిస్తాడు. అంతేకాకుండా దగ్గర ఉండి బిర్యానీ వడ్డిస్తాడు. ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యపోయాను. నిజంగా ప్రభాస్ చాలా స్వీట్’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మాళవిక మోహనన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతోంది.


Next Story