నా మార్ఫింగ్ ఫొటోలు చూసి నేనే షాక్ అయ్యా: కీర్తి సురేష్

by Chukka Sudharani |   (  Updated:2025-11-20 13:50:34  IST  )

ఇటీవల కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధస్సు (AI) కారణంగా.. చాలామంది అనేక రకాలుగా నష్టపోతున్నారు.

నా మార్ఫింగ్ ఫొటోలు చూసి నేనే షాక్ అయ్యా: కీర్తి సురేష్
X

దిశ, సినిమా: ఇటీవల కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధస్సు (AI) కారణంగా.. చాలామంది అనేక రకాలుగా నష్టపోతున్నారు. ఈ సమస్య సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరిని వెంటాడుతోంది. ముఖ్యంగా డీప్ ఫేక్ టెక్నాలజీ, మార్ఫింగ్ ఫొటోలు, నకిలీ వీడియోల కారణంగా సెలబ్రిటీలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పటికే దీనిపై అనేక మంది సెలబ్రిటీలు స్పందించగా.. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ రియాక్ట్ అవుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నా పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని బోల్డ్ ఫొటోలను చూసి నేనే షాక్ అయ్యాను. అవి నేను దిగినవి కాదు.. పూర్తిగా AI ద్వారా సృష్టించినవి. ఫొటోలు ఎంత నిజంగా కనిపిస్తున్నాయంటే.. వాటిని చూసి నేనే షాక్ అయ్యాను. అవి నిజంగానే నేను ఫోజులిచ్చానా? అని నాకే డౌట్ వచ్చినంత నిజమైన ఫొటోల్లా కనిపించాయి. కానీ ఆ నకిలీ ఫొటోలు కారణంగా నేను మానసికంగా ఎంతో బాధపడ్డాను. ఇలాంటి టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ తెలిపింది.

Next Story