- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
15 మంది పురుషులతో 20 రోజుల పాటు బట్టలు లేకుండా న్యూడ్‌గా ఉన్నాను.. రామ్ చరణ్ బ్యూటీ సంచలన కామెంట్స్
‘మైనా’(Maina) మూవీతో ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైన అమలాపాల్(Amalapaul) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘మైనా’(Maina) మూవీతో ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైన అమలాపాల్(Amalapaul) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రంలో తన నటనతో తమిళనాడు రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది. ఇక తెలుగులో ‘ఇద్దరమ్మాయిలతో’(Iddarammayilatho) సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయి ఆ తర్వాత రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘నాయక్’(Nayak) మూవీతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది.
ఇదిలా ఉంటే అమలాపాల్ నటించిన ‘ఆమె’(Ame) సినిమా ఎంతగా విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. తమిళ్‌లో ‘ఆడై’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ నగ్నంగా నటించి మెప్పించింది. అయితే న్యూడ్ సన్నివేశంలో నటించిన విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘ నేను నగ్నంగా నటించే సన్నివేశాన్ని 15 మంది పురుషుల సమక్షంలో షూట్ చేశారు.
అది నాకు సవాలుగా అనిపించినప్పటికీ, సినిమాలో పాత్రకు న్యాయం చేయడానికి ఆ సన్నివేశంలో నటించాను. ఈ సీన్ కోసం నేను దాదాపు 20 రోజుల పాటు న్యూడ్‌గా నటించాల్సి వచ్చింది. ఈ ప్రక్రియలో చాలా ఇబ్బందులు పడ్డాను. అయితే ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నప్పుడు ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడింది. ఇది ఇంకొంత బాధను కలిగించింది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమలాపాల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






