ప్రభాస్ సినిమా విషయంలో తొందరపడ్డా.. చేయకుండా ఉండాల్సిందంటూ యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) ‘అల్లుడు శ్రీను’ (alludu srinu) చిత్రంతో వచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు.

ప్రభాస్ సినిమా విషయంలో తొందరపడ్డా.. చేయకుండా ఉండాల్సిందంటూ యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) ‘అల్లుడు శ్రీను’ (alludu srinu) చిత్రంతో వచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. అలా పలు సినిమాల్లో నటించిన ఆయన ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. అయితే 2023లో ‘ఛత్రపతి’ (Chhatrapati)మూవీని హిందీ రిమేక్ చేసి డిజాస్టర్‌ను ఎదుర్కొన్నాడు. దీంతో ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భైరవం’(Bhairavam). ఈ మల్టీస్టారర్ చిత్రంలో నారా రోహిత్, మంచు మనోజ్(Manchu Manoj) కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే మే 30న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

‘‘హిందీలో సినిమాలు చేసిన తెలుగు నటుడు పెద్దగా లేరు. మా జనరేషన్‌లో రానా, రామ్ చరణ్ మాత్రమే చేశారు. కానీ ‘ఛత్రపతి’రీమేక్ విషయంలో నేను తొందరపడ్డాను. రాజమౌళి సినిమా 100 శాతం విజయం సాధించింది. ఎమోషన్‌కు బాగా కనెక్ట్ అవుతారని అనుకున్నా. నిర్మాత ముందే చెప్పినా వినలేదు. అందుకే ఆ సినిమా షూటింగ్ సమయంలో అది వర్కవుట్ అవుతుందా? లేదా అన్న డైలమాలో పడ్డా. తెలియకుండా 100 శాతం దృష్టిపెట్టలేకపోయాను. చేయకుండా ఉండాల్సింద అనిపిస్తుంది. ఆ తర్వాత కాస్త గ్యాప్ కూడా వచ్చింది. కానీ ఇప్పటినుంచి అలా జరగదు వరుస సినిమాలు చేస్తాను’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story