- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ananya Pandey: నా శరీరం గురించి చాలా దారుణంగా విమర్శలు చేశారు.. అనన్య పాండే ఎమోషనల్ కామెంట్స్
బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pandey) ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’(Student of the Year-2) సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pandey) ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’(Student of the Year-2) సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. ఇక ఆ తర్వాత వరుస చిత్రాల్లో నటించిన ఆమె తన అందం, అభినయం నటనతో అందరినీ మెస్మరైజ్ చేసింది. వరుస హిట్స్ సాధించి అనతి కాలంలోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఇటీవల ‘కేసరి చాప్టర్-2’ (Kesari Chapter-2)బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘చాంద్ మేరా దిల్’(Chand Mera Dil) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య పాండే ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్త చాలా సన్నగా ఉండేదాన్ని.
18-19 ఏళ్ల వయసు ఉండేది. ఇండస్ట్రీలో నా పర్సనాలీటిపై చాలా కామెంట్స్ చేశారు. అగ్గిపుల్ల లా ఉన్నావు.. నీ కాళ్ళు కోడి కాళ్ళలా ఉన్నాయి.. నీ శరీరం సరైన ఆకారంలో లేదు అని విమర్శలు చేశారు. ఏజ్‌కి తగ్గట్లుగా శరీరంలో మార్పులు జరుగుతాయి. ఇప్పుడిప్పుడే నా శరీరం సహజంగానే మారుతుంటే.. ఇప్పుడు మళ్లీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అంటున్నారు. ఆగవాళ్లు ఎలా ఉన్నా ఇండస్ట్రీలో ఇలాంటి విమర్శలు తప్పవు. కాబట్టి అవన్నీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలని నిర్ణయించుకున్నాను. యాక్టింగ్ ఒక్కటే ఉంటే సరిపోదు.. ఈ రోజుల్లో కచ్చితంగా సరైన బాడీ కూడా ఉండాలి’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమెకు అండగా నిలుస్తున్నారు.






