- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. ఎట్టకేలకు మనసులో మాట బయటపెట్టిన మెగా బ్యూటీ
‘ఒక లైలా కోసం’(Oka Laila Kosam) మూవీలో నాగ చైతన్య(Naga Chaitanya) సరసన నటించిన పూజా హెగ్డే(Pooja Hegde).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

దిశ, సినిమా: ‘ఒక లైలా కోసం’(Oka Laila Kosam) మూవీలో నాగ చైతన్య(Naga Chaitanya) సరసన నటించిన పూజా హెగ్డే(Pooja Hegde).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అంతేకాకుండా యూత్ మనసులో క్రష్ అయిపోయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన చిత్రాలన్నిటిలో నటించి మెప్పించింది. ఇక అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన ‘అల వైకుంఠపురంలో’(Ala Vaikuntapuramlo) సినిమాలోని ‘బుట్టబొమ్మ’(Butta Bomma) సాంగ్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది.
అయితే అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి అలరించిన ఈ బ్యూటీకి సడెన్‌గా వరుస ప్లాప్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. దీంతో ఐరన్ లెగ్ బిరుదుతో పాటు సినిమా చాన్స్‌లు కరువయ్యాయి. దీంతో కొన్ని నెలలు సినిమాలకు దూరం అయిన ఈ బ్యూటీ ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఐదు చిత్రాలతో అలరించడానికి మన ముందుకు రానున్నది.
ఈ క్రమంలో ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా మాట్లాడుతూ.. “పదేళ్లు దాటిన నా ప్రయాణంలో చాలా క్యారెక్టర్లు చేశాను. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అయితే ప్రజెంట్ నాకు కంప్లీట్ యాక్షన్, తండ్రి కూతుళ్ల అనుబంధంతో సాగే సినిమాలు, పిల్లల కోసం హ్యారీ పోటర్ తరహా చిత్రాలు చేయాలని ఉంది. అలాగే సూపర్ మాన్ తరహా స్టోరీ వస్తే ఎగిరి గంతేసి చేస్తాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజా హెగ్డే చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






