విజయ్ దేవరకొండతో మిస్ శ్రీలంక మూవీ.. క్రేజ్ మాములుగా లేదుగా !

by velandi.Saikiran |

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (vijay dewarakonda) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి

విజయ్ దేవరకొండతో మిస్ శ్రీలంక మూవీ.. క్రేజ్ మాములుగా లేదుగా !
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (vijay dewarakonda) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే టాప్ మోస్ట్ హీరోగా మారిపోయాడు ఈ విజయ్ దేవరకొండ. అయితే అలాంటి విజయ్ దేవరకొండ క్రేజ్... ఇండియాను దాటి.. పక్క దేశాలకు కూడా పాకింది. పక్క దేశమైన శ్రీలంకలో కూడా విజయ్ దేవరకొండకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇదే విషయాన్ని తాజాగా మిస్ శ్రీలంక అనుది గుణశేఖర ( I Want to Act With Vijay Deverakonda, Miss SriLanka Anudi Gunasekara) చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అందాల పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అందాల పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచంలోని నలుమూలల ఉన్న అందాల భామలు వచ్చారు. ఈ నేపథ్యంలోనే మిస్ శ్రీలంక అనుది గుణశేఖర కూడా హాజరయ్యారు.

ఈ తరుణంలోనే.. ఇండియాకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ మిస్ శ్రీలంక. తెలుగులో ఏ హీరో తో సినిమా చేయాలని అనుకుంటున్నారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చారు అనుది గుణశేఖర. తనకు విజయ్ దేవరకొండ తో నటించాలని ఉందని.. అతను అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. శ్రీలంకలో విజయ్ దేవరకొండ సినిమాలు కూడా చూస్తామని వివరించారు మిస్ శ్రీలంక అనుది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ అసోసియేషన్ మీడియాలో వైరల్ గా మారాయి.

Next Story