అతనితో రొమాన్స్ చేసేందుకు ఎంతకైనా తెగిస్తా..పూజా బోల్డ్ కామెంట్స్?

by velandi.Saikiran |   (  Updated:2025-08-12 11:32:14  IST  )

బాహుబలి 3 సినిమా తీస్తే బాగుంటుందని.. బాహుబలి 3 సినిమా వస్తే... కచ్చితంగా నటించేందుకు ప్రయత్నం చేస్తానని పూజా వివరించారట

అతనితో రొమాన్స్ చేసేందుకు ఎంతకైనా తెగిస్తా..పూజా బోల్డ్ కామెంట్స్?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ పూజా హెగ్డే ( Pooja Hegde) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 19 సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఎన్నో సినిమాలను తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే... ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలే రావడం లేదు. ఇక తాజాగా మోనికా అనే పాటలో చిందులు వేస్తూ సందడి చేస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో రీఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది పూజా హెగ్డే. జక్కన్న దర్శకత్వంలో వచ్చిన.. బాహుబలి సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె పేర్కొన్నారు. అయితే ప్రభాస్ తో జక్కన్న.. బాహుబలి 3 సినిమా తీస్తే బాగుంటుందని ఆమె వెల్లడించారట.

ఒకవేళ బాహుబలి 3 సినిమా వస్తే... కచ్చితంగా ఆ సినిమాలో నటించేందుకు ప్రయత్నం చేస్తానని పూజా వివరించారట. ప్రభాస్ తో నటించేందుకు... ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు స్పష్టం చేశారట పూజా హెగ్డే. ఆ పాత్ర కోసం ఎంతకైనా తెగిస్తానని వెల్లడించారట. దీంతో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Next Story