Shriya Reddy: ఆ సీన్స్‌కు ముందు 50 నుంచి 60 పుష్ అప్స్ తీసేదాన్ని.. శ్రియా రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

ప్రభాస్ సలార్ చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో క్రేజ్ పెంచేసుకుంది శ్రియా రెడ్డి.

Shriya Reddy: ఆ సీన్స్‌కు ముందు 50 నుంచి 60 పుష్ అప్స్ తీసేదాన్ని.. శ్రియా రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ప్రభాస్ సలార్ చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో క్రేజ్ పెంచేసుకుంది శ్రియా రెడ్డి. ఇందులో శ్రియా రాధారమ అనే పాత్రలో కనిపించి మెప్పించడంతో పాటు అందులో మెయిన్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇక రీసెంట్‌గా పవన్ కల్యాణ్ ‘ఓజీ’ లో కూడా అద్భుతమైన రోల్‌లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రియా రెడ్డి.. సలార్‌లో తను అంత హైలెట్ కావడానికిగల రీజన్‌ను పంచుకుంది. ‘సలార్ షూటింగ్ గురించి గుర్తుచేసుకుంటే.. నా ప్రతి సీన్‌కి ముందుకు దాదాపు 50 నుంచి 60 వరకు పుష్ అప్స్ తీసేదాన్ని.

కాస్ట్యూమ్ వేసుకున్నా, కారవ్యాన్‌లో ఉన్నా ఇది తప్పనిసరి. నా వరకు అయితే పుష్ అప్స్ తీయడం అనేది చాలా సులభమైన వర్కౌట్. షూటింగ్ జరుగుతున్న టైంలోనూ దీని గురించి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి ముందే చెప్పాను. దీంతో నా సీన్స్ తీయడానికి కొంచెం ముందే నాకు చెప్పేవారు. నేను పుష్ అప్స్ పూర్తి చేసుకుని షూట్‌లోకి వెళ్లేదాన్ని. దీంతో అందరి మధ్య నేను శక్తిమంతురాలిలా కనిపించేదాన్ని. ఖాన్సార్‌లోని మగాళ్ల కంటే నాకు నేనే అజేయంగా అనిపిచేదాన్ని’ అంటూ తెలిపింది.

Next Story