- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా ఫస్ట్ సినిమాకు రెమ్యూనరేషన్ రూ.6000 తీసుకున్నాను.. విజయ్ దేవరకొండ బ్యూటీ షాకింగ్ కామెంట్స్(వీడియో)
టాలీవుడ్ యంగ్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్(Priyanka Jawalkar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్(Priyanka Jawalkar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘కల వరం ఆయే’(Kala Varam Aaye) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) సరసన ‘టాక్సీవాలా’(Taxiwala) సినిమాలో నటించి మెప్పించింది. ఈ మూవీతో తెలుగు ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘తిమ్మరుసు’(Timmarusu), ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’(SR Kalyanamandapam), ‘గమనం’(Gamanam), ‘టిల్లు స్వ్కేర్’(Tillu Square) మూవీలో నటించి అలరించింది. ఇక రీసెంట్‌గా ‘మ్యాడ్ స్వ్కేర్’(MAD Square) సినిమాలో ఐటెం సాంగ్‌లో చిందులేసింది.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నా ఫస్ట్ మూవీ కల వరం ఆయే సినిమా ఆఫర్ వచ్చినప్పుడు నాకు కొంచెం అర్థం అవుతుంది కదా సినిమా అంటే ఎలా ఉంటుందో అని చేద్దాం అనుకున్నాను. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వారి దగ్గర బడ్జెట్ లేదు. దీంతో నాకు రెమ్యునరేషన్‌గా రూ.10,000 ఇస్తా అన్నారు. అప్పుడు నేను అన్నా వద్దులేండి అవికూడా బడ్జెట్ లేదంటున్నారుగా అని అన్నాను.
అయితే మా ఫ్రెండ్ అలా చేయకూడదు ఎంతో అంత తీసుకుని వర్క్ చేయాలి అని చెప్పింది. దీంతో నేను మళ్లీ వాళ్ల దగ్గరికి వెళ్లి ఓకే పదివేలకు చేస్తాను సినిమా అని చెప్పినప్పుడు వాళ్లు స్వారీ మీరు అలా అనేసరికి అందులో కొంత మనీ వేరే వర్క్‌కి యూస్ చేశాము. ఇప్పుడు మీకు 6000 మాత్రమే ఇవ్వగలము అని చెప్పారు. అలా నా ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ 6000 తీసుకున్నాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియాంక జువాల్కర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






