- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నాకు ఎదురైన సంఘటనలు మాత్రమే చెప్పాను.. ఎవరినో బ్లేమ్ చేయడానికి కాదు.. అనసూయ సంచలన పోస్ట్

దిశ, సినిమా: జబర్దస్త్ షో(Jabardasth Show)కి యాంకరింగ్ చేసి నేడు సినిమాల్లో కీ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగిన యాంకర్ అనసూయ(Anasuya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన యాంకరింగ్‌తో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటించిన ‘రంగస్థలం’(rangasthalam) సినిమాలో రంగమ్మత్తగా నటించే చాన్స్ లభించింది. ఆ మూవీతో ఈ అమ్మడు గ్రాఫ్ ఒక్కసారిగా చేంజ్ అయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.
అలా కొన్ని చిత్రాల్లో మెయిన్ లీడ్ కూడా పోషించింది. అలాగే మరోసారి సుకుమార్ దర్శకత్వంలో బన్నీ(Allu Arjun) హీరోగా వచ్చిన ‘పుష్ప’(Pushpa) మూవీలో సునీల్(Sunil) భార్య దాక్షాయణిగా నటించి మెప్పించింది. తన నటనతో అందరికీ షాక్‌కు గురిచేసింది. ఇక రీసెంట్‌గా ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘పుష్ప-2’(Pushpa-2)లో కూడా నటించి అలరించింది. అలా ఓ పక్కా సినిమాలతో బిజీ ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొజులతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది. అయితే కొన్ని కొన్ని సార్లు తన డ్రెస్సింగ్ సెన్స్ వల్ల ట్రోలింగ్‌కి కూడా గురైయింది.
అయినప్పటికీ వారికి గట్టి కౌంటర్ ఇస్తూ నెట్టింట వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ హాట్ పోస్ట్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో రచ్చ రచ్చ అవుతుంది. తాజాగా అనసూయ తన ట్విట్టర్(X) వేదికగా ఓ ట్వీట్(Tweet) చేసింది. అందులో..” నేను నాకు ఎదురైన అనుభవాన్ని, నేను చూసిన సంఘటనలను మాత్రమే పంచుకున్నాను. నేను ఎవరిని బ్లేమ్ చెయ్యట్లేదు. కానీ అవగాహన కల్పించడం కోసమే నేను మాట్లాడాను. ఆడియన్స్‌కి, మీడియాకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి నా మాటలను వక్రీకరించి నేను అనని మాటలు అన్నట్టు చెప్పొద్దు. ఇలాంటివి నా క్యారెక్టర్‌ని డిసైడ్ చేయలేవు. నిజమే నిలుస్తుంది. నన్ను అర్థం చేసుకున్న వారికి మాత్రం ప్రేమను పంపిస్తాను” అని రాసుకొచ్చింది.
దీంతో అనసూయ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ ట్వీట్ దేని కోసం వేసింది, ఎవరి కోసం వేసింది అని చర్చ మొదలైంది. కాగా ఇటీవల అనసూయ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో అనేక కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ గురించి, కాస్టింగ్ కౌచ్ గురించి, తన డ్రెస్సింగ్, ఫ్యామిలీ, రిలేషన్ షిప్.. ఇలా అనేక అంశాల గురించి మాట్లాడింది. ఇక ఈ ఇంటర్వ్యూలో తను చేసిన వ్యాఖ్యల గురించి ఎవరైనా తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడారేమో, అందుకే అనసూయ ఇలా ట్వీట్ చేసిందేమో అని ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు భావిస్తున్నారు. కానీ అసలు కారణం మాత్రం తెలియరాలేదు.