ఆ సినిమాలో అస్సలు నటించొద్దు అనుకున్నాను.. కానీ తప్పలేదు.. వేణు సంచలన వ్యాఖ్యలు

by Pulgam srinivas |

వేణు మాట్లాడుతూ… రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేయకూడదని అనుకున్నానని, ఆ చిత్ర దర్శకుడు శరత్ మండువా గట్టిగా పట్టుబట్టడంతో చివరికి ఆ సినిమాలో నటించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.

ఆ సినిమాలో అస్సలు నటించొద్దు అనుకున్నాను.. కానీ తప్పలేదు.. వేణు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు వేణు తొట్టెంపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన 1999లో విడుదలైన స్వయంవరం చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో వేణుకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆయన కెరీర్ కొంతకాలం పాటు విజయవంతంగా కొనసాగింది. అయితే వరుసగా వచ్చిన పరాజయాల కారణంగా ఆయన సినీ ప్రయాణం కాస్త నెమ్మదించింది. ఈ సమయంలో వేణు చింతకాయల రవి, దమ్ము వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

అనంతరం కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల ఈ నటుడు రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో కూడా కీలక పాత్రలో కనిపించారు. అలాగే అతిధి అనే వెబ్ సిరీస్‌లో నటించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రంలో నటించడానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ… “రామారావు ఆన్ డ్యూటీ దర్శకుడు శరత్ మండువా మరియు ఎస్.ఎల్.వి బ్యానర్ ప్రతినిధులు ఒక పాత్ర గురించి నన్ను సంప్రదించారు.

అప్పట్లో నాకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి పెద్దగా లేదు. అందుకే నేను ముందుగా అంగీకరించలేదు. కానీ దర్శకుడు శరత్ మాత్రం ‘మీరు సినిమా చేయకపోయినా పర్లేదు, ఒక్కసారి కలవండి’ అని అన్నారు. దాంతో కలిశాను. కలిసిన తర్వాత ఆయన నాకు ఈ పాత్రలో మీరు తప్పకుండా కావాలి అని గట్టిగా చెప్పారు. ఆయన పట్టుదల చూసి చివరికి ఒప్పుకొని సినిమాలో నటించాను” అని తెలిపారు. అయితే రామారావు ఆన్ డ్యూటీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో వేణుకు కూడా ఈ చిత్రం ద్వారా పెద్దగా గుర్తింపు లభించలేదు.

Next Story