నేను దర్శకురాలిగా మారాలి అనుకుంటున్నాను.. ఫారియా అబ్దుల్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Pulgam srinivas |

ఫారియా మాట్లాడుతూ.. "నాకు దర్శకత్వంపై కూడా ఆసక్తి ఉంది. మరికొంత కాలంలోనే ఒక సినిమాకు దర్శకత్వం వహించాలని అనుకుంటున్నాను" అని తెలిపింది.

నేను దర్శకురాలిగా మారాలి అనుకుంటున్నాను.. ఫారియా అబ్దుల్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: పొడుగు కాళ్ల సుందరి ఫారియా అబ్దుల్లా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ జాతిరత్నాలు చిత్రంతో వెండితెరకు పరిచయం అయి, మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని మరియు గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో నటించిన ఆ స్థాయి విజయం ఆమెకు దక్కలేదు. ఈ నటి కేవలం సినిమాల్లో హీరోయిన్ పాత్రలతో మాత్రమే కాకుండా బంగార్రాజు చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో కూడా నటించి తన అందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంది. తాజాగా ఈ బ్యూటీ తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో రూపొందిన గాయపడ్డ సింహం చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. మే 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

దాంతో ఈ నటి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వస్తోంది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా తన భవిష్యత్ కార్యాచరణ గురించి క్లియర్‌గా చెప్పుకొచ్చింది. ఫారియా మాట్లాడుతూ... "నాకు నటనతో పాటు దర్శకత్వంపై కూడా ఆసక్తి ఉంది. దాదాపు గత సంవత్సరం నుంచి నేను కొన్ని కథలను రాస్తున్నాను. అందులో ఏదో ఒక కథను పూర్తిగా సిద్ధం చేసి మరికొంత కాలంలోనే ఒక సినిమాకు దర్శకత్వం వహించాలని అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చింది. కెరీర్ మంచి జోష్‌లో ముందుకు సాగుతున్న సమయంలో దర్శకత్వంపై ఆసక్తి ఉందని ఈ బ్యూటీ చెప్పడం ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

Next Story