హోటల్ గదిలో నేను ఆత్మను చూశాను.. ఆ తర్వాత.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by I. Sairam |

ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ రేంజ్‌కి మారిపోయిన కృతి శెట్టి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే.

హోటల్ గదిలో నేను ఆత్మను చూశాను.. ఆ తర్వాత.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఉప్పెన;(Uppena) మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ రేంజ్‌కి మారిపోయిన కృతి శెట్టి(Krithi Shetty) గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఫస్ట్ మూవీతోనే తెలుగు ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టేసింది. దీంతో ఈ భామ గ్రాఫ్ చేంజ్ అయిపోతుంది అని అందరూ అనుకున్నారు. అయితే అవకాశాలు బానే వచ్చినప్పటికీ ఆ సినిమాలు అంతగా మెప్పించలేక పోయాయి. దీంతో ఈ భామ రేంజ్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. ప్రస్తుతం ఈ చిన్నది ‘వా వాతియార్’ సినిమాలో యాక్ట్ చేస్తుంది.

ఇక ఇందులో కార్తి(karthi) హీరోగా నటిస్తున్నాడు. నలన్ కుమారస్వామి (Nalan Kumaraswamy)దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఈ చిన్నది వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ అక్కడ తన గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృతి శెట్టి తనకు జరిగిన ఓ వింత అనుభవం గురించి షేర్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘"కార్తీ వా వాతియర్ (అన్నగారు వస్తారు) షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందు రోజు రాత్రి మా అమ్మతో కలిసి ఓ హోటల్ గదిలో ఉన్నాను.

అప్పుడు అక్కడే ఓ ఆత్మను చూశాను. మేం లైట్ వేయగానే పెద్ద సౌండ్ వచ్చింది. ఆ తర్వాత ఆత్మ కనిపించలేదు. మరి అది నాకు సాయం చేయడానికి వచ్చిందో లేదా నేను చేస్తున్న ప్రాక్టీస్ వల్ల వచ్చిందో తెలియదు. నాకు ముందు నుంచి ఆత్మలపై నమ్మకం ఉంది. నేను తుళు జాతికి చెందిన అమ్మాయిని. మా పూర్వీకులను దేవతలుగా పూజిస్తాం. వాళ్లు మమ్మల్ని ఎప్పుడు కాపాడుతుంటారు" అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story