కథ విని నేనే షాక్ అయ్యా.. ‘టాక్సిక్’పై అంచనాలు పెంచిన కియారా అద్వానీ

by Mallepaka Hamsa |

ప్రతి సీన్ షూటింగ్‌కు ముందు డైలాగులను బట్టీ పడుతూ, వాటిని సరిగ్గా పలకడం కోసం రాత్రింబగళ్లు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేదని అయినప్పటికీ తాను కష్టంగా కాకుండా ఎంతో ఇష్టంగా షూట్ పూర్తి చేసినట్లు చెప్పారు.

కథ విని నేనే షాక్ అయ్యా.. ‘టాక్సిక్’పై అంచనాలు పెంచిన కియారా అద్వానీ
X

దిశ, సినిమా: రాకింగ్ స్టార్ యష్ హీరోగా వస్తున్న 'టాక్సిక్' పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తుండగా.. హీరోయిన్‌గా నటిస్తున్న కియారా అద్వానీ నటిస్తోంది. పీరియడ్ గ్యాంగ్‌స్టర్ చిత్రంగా తెరకెక్కగా.. ఇందులో నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్ కె. నారాయణ, యష్ సంయుక్తంగా వరుసగా కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకుని జూన్ 4న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ టీమ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ పలు విశేషాలు పంచుకుంటున్నారు. తాజాగా, ఓ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా కియారా షూటింగ్ సమయంలో పడ్డ కష్టాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఈ సినిమాను మొదట ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా షూట్ చేశారని ఆ తర్వాత మిగిలిన భాషల్లోకి డబ్ చేసి పాన్-ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారని తెలిపారు. అయితే, తనకు కన్నడ భాష అస్సలు రాకపోవడం వల్ల షూటింగ్ చేయడం చాలా కష్టంగా మారిందని కియారా అన్నారు.

ప్రతి సీన్ షూటింగ్‌కు ముందు డైలాగులను బట్టీ పడుతూ, వాటిని సరిగ్గా పలకడం కోసం రాత్రింబగళ్లు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేదని అయినప్పటికీ తాను కష్టంగా కాకుండా ఎంతో ఇష్టంగా షూట్ పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ భాషా సమస్యను తన కెరీర్‌లోనే అతిపెద్ద ఛాలెంజ్‌గా ఆమె భావిస్తున్నట్లు తెలిపారు. భాష రాకపోయినా ఎక్కడా నటనలో తప్పులు లేకుండా, స్క్రీన్ మీద చాలా సహజంగా కనిపించడం కోసం తను ఎంతో కష్టపడినట్లు కియారా వివరించారు. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ గతంలో 'మూతోన్' లాంటి సినిమాల్లో చాలా సీరియస్ పాత్రలను చూపించారు. ఇప్పుడు 'టాక్సిక్' లో కూడా యష్ క్యారెక్టర్‌ను ఎవరూ ఊహించని విధంగా, ఒక సరికొత్తవిల నిజంతో కూడిన హీరో పాత్రలో చూపించబోతున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుందని, కథ విన్నప్పుడు తానే షాక్ అయ్యానని తెలిపింది. ఇందులో ప్రేమను చూపించిన విధానం చాలా కొత్తగా, ఎంతో స్వేచ్ఛగా ఉంటుందని చెప్పారు. ఆ పాత్రల గొప్పతనాన్ని వివరిస్తూ.. "ఆ కథ విన్న తర్వాత, నా సొంత ఆలోచనలలో కూడా నేను అంత ధైర్యంగా, దేనికీ లొంగకుండా, అంత స్వేచ్ఛగా ఉండగలిగితే ఎంత బాగుంటుందో అనిపించింది" అంటూ కియారా ఎమోషనల్ అయ్యారు. ఇది పూర్తిగా ఒక అద్భుతమైన ఎమోషనల్ డ్రామా ఫిల్మ్ అని కియారా స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ సినిమాలో తాను చేసిన ఒక సీన్ తన కెరీర్‌లోనే బెస్ట్ సీన్ అని ఆమె సంతోషంగా చెప్పుకొచ్చారు. ఇక ఇటీవల రామ్ చరణ్‌తో కలిసి కియారా నటించిన 'గేమ్ ఛేంజర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో, ఇప్పుడు ఎలాగైనా 'టాక్సిక్' సినిమాతో ఒక పెద్ద హిట్ కొట్టాలని ఆమె చూస్తున్నారు. ఇక కియారా కామెంట్స్‌తో ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

Next Story