- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ సినిమాలో నేను ఎక్కువగా దాన్ని ప్రేమిస్తాను.. కయాదు లోహర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
శ్రీవిష్ణు(Sri Vishnu) నటించిన అల్లూరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ బ్యూటీ కయాదు లోహార్ (Kayadu Lohar) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: శ్రీవిష్ణు(Sri Vishnu) నటించిన అల్లూరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ బ్యూటీ కయాదు లోహార్ (Kayadu Lohar) మనందరికీ సుపరిచితమే. ఇక ఈ భామ అందానికి కుర్రకారు మెస్మరైజ్ అయ్యారు. దీంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అలా గత ఏడాది యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan)తో కలిసి ‘డ్రాగన్’(Dragon) సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టి ఫుల్ బిజీబిజీగా ఉంటుంది. ఇక ఈ చిన్నది సినిమాలతోనే కాదు సోషల్ మీడియాతోనూ ఎప్పటికపుడు నెటిజన్లు, మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంటుంది.
ఇదిలా ఉంటే.. కయాదు నటిస్తున్న సినిమాలో ‘ఫంకీ’(Funkey) ఒకటి. మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్(anudeep) దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఫిబ్రవరి 13న ప్రేమికుల రోజు కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కయాదు సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఆమె మాట్లాడుతూ.. ‘ఇది సినిమా నేపథ్యంతో కూడిన కథ. ఇందులో నేను నిర్మాత కూతురుగా కనిపిస్తా. నా క్యారెక్టర్ పేరు చిత్ర. తండ్రి డబ్బుని ఆదా చేయాలని ఆశించే కూతురు పాత్ర. అంతేకాదు, మనీ మేనేజ్మెంట్ గురించి తను ఎక్కువగా మాట్లాడుతుంటుంది. డబ్బుని అమితంగా ప్రేమిస్తుంది. నిజంగా విభిన్నమైన పాత్రని చెప్పవచ్చు. విశ్వక్ ఇందులో డైరెక్టర్‌గా కనిపిస్తారు. మా ఇద్దరి కాంబినేషన్ సీన్స్ వినోదాత్మకంగా ఉంటాయి. దర్శకుడు అనుదీప్ రాసుకున్న కథలోనే తెలియని ఫన్ ఉంది. అదేంటో రేపు మీరు థియేటర్లలో చూస్తారు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






