నాకు ఆ టాలీవుడ్ హీరో అంటే చాలా ఇష్టం.. ఇంటర్వ్యూలో ఓపెన్ అయిన మృణాల్

by Pulgam srinivas |

మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ... నాకు బాలకృష్ణ గారు అంటే చాలా ఇష్టం. నేను ఆయనకు పెద్ద ఫ్యాన్‌ని అంటూ ‘జై బాలయ్య’ అని ఉత్సాహంగా చెప్పింది.

నాకు ఆ టాలీవుడ్ హీరో అంటే చాలా ఇష్టం.. ఇంటర్వ్యూలో ఓపెన్ అయిన మృణాల్
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హిందీ సీరియల్స్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈమె, ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీలో ‘జెర్సీ’ చిత్రంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ, అనంతరం ‘సీత రామం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ నటి ‘డెకాయిట్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటివరకు మృణాల్ నటించిన చిత్రాల్లో ఆమె గ్లామర్ కంటే నటనతోనే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరోయిన్, తనకు ఇష్టమైన టాలీవుడ్ హీరో ఎవరు అనే ప్రశ్నకు స్పందించింది. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నాకు బాలకృష్ణ గారు అంటే చాలా ఇష్టం. నేను ఆయనకు పెద్ద ఫ్యాన్‌ని” అంటూ ‘జై బాలయ్య’ అని ఉత్సాహంగా చెప్పింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story