- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘8వసంతాలు’లో మొదటగా ఆ స్టార్ హీరో, హీరోయిన్‌ను అనుకున్నాను, కానీ.. డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘8 వసంతాలు’(8 Vasantalu).

దిశ, వెబ్‌డెస్క్: యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘8 వసంతాలు’(8 Vasantalu). ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని(Naveen Yarneni), వై రవి శంకర్(YV Ravi Shankar) నిర్మించగా.. మ్యాడ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సనిల్ కుమార్(Ananthika Sanilkumar) హీరోయిన్‌గా నటించింది. లవ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ నర్సెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘మొదటగా 8 వసంతాలు సినిమాలో హీరోయిన్‌గా స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె(Deepika Padukone)ను, హీరోగా సూర్య(Surya)ను అనుకున్నాను. కానీ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రానికి కొత్త ఫేసెస్ అయితే బాగుంటుంది అని సజెస్ట్ చేసింది. అందుకే అనంతిక సనిల్ కుమార్, హను రెడ్డి(Hanu Reddy) లను తీసుకున్నాము’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. Link






