ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌ని నేను గతంలో ఎప్పుడూ చూడలేదు.. యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by I. Sairam |

యంగ్ హీరో రోషన్(Roshan Meka), అనస్వర రాజన్(Anaswara Rajan) జంటగా నటించిన సినిమా 'ఛాంపియన్'(Champion).

ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌ని నేను గతంలో ఎప్పుడూ చూడలేదు.. యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో రోషన్(Roshan Meka), అనస్వర రాజన్(Anaswara Rajan) జంటగా నటించిన సినిమా 'ఛాంపియన్'(Champion). ప్రదీప్ అద్వైత్(Pradeep Adhwaith) దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ డిసెంబర్ 25న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది.

ఈ సందర్భంగా మేకర్స్ పీపుల్స్ ఛాంపియన్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్‌లో హీరోయిన్ అనస్వర రాజన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘మా సినిమాకి అద్భుతమైన విజయాన్ని ఇచ్చి మమ్మల్ని ఛాంపియన్స్ చేసిన ఆడియన్స్‌కి థాంక్యూ. ఛాంపియన్ నా మొదటి తెలుగు సినిమా. థియేటర్స్‌లో కూర్చుని ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది.

ఇలాంటి ఎక్స్పీరియన్స్‌ని నేను గతంలో ఎప్పుడూ చూడలేదు. గిరగిరా నా ఫేవరెట్ సాంగ్. మిక్కీ గారు అద్భుతమైన ఆల్బమ్ క్రియేట్ చేశారు. చంద్రకళ పాత్ర ఇచ్చిన ప్రదీప్ అన్నకి థాంక్యూ. సప్న గారి సపోర్ట్‌కి థాంక్యూ. సినిమాకు ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ’ అని అనస్వర రాజన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story