- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త కథల గురించి ఆలోచించడం కూడా పూర్తిగా మానేశా: మాధవన్
తన జీవితంలో 40 ఏళ్ల వయసు వచ్చినప్పుడు సినిమాలపై పూర్తిగా ఆసక్తిని కోల్పోయానని ఆయన తెలిపారు.

దిశ, సినిమా: మాధవన్ త్వరలోనే ‘జీడీ నాయుడు’ బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భారతదేశపు గొప్ప ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త అయిన జీడీ నాయుడు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కృష్ణ కుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రియమణి, జయరామ్, సత్యరాజ్, దుషారా విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ క్రేజీ సినిమాను ఆగస్టు 7న థియేటర్లలో విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవన్, తన సినీ కెరీర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన జీవితంలో 40 ఏళ్ల వయసు వచ్చినప్పుడు సినిమాలపై పూర్తిగా ఆసక్తిని కోల్పోయానని ఆయన తెలిపారు.
ఆ సమయంలో తన కెరీర్‌లో ఒక భిన్నమైన దశ నడిచిందని, అప్పట్లో తాను చేసిన సినిమాలన్నీ కేవలం సాధారణ విజయాలుగా మాత్రమే మిగిలిపోయాయని వివరించారు. వాటి వల్ల తనకు పెద్ద పేరు రాలేదని అన్నారు. అలాగని కెరీర్ ఆగిపోనూ లేదని చెప్పారు. ఆ రోజుల్లో ఉదయాన్నే నిద్రలేవగానే కథల గురించి ఆలోచించాలనే ఆరాటం కానీ, ఎప్పుడెప్పుడు షూటింగ్ సెట్స్‌కి వెళ్లాలా అనే ఉత్సాహం కానీ తనలో అస్సలు ఉండేవి కావని మాధవన్ అన్నారు. చివరికి కొత్త కథల గురించి ఆలోచించడం కూడా పూర్తిగా మానేశానని తెలిపారు. అయితే తన ప్రవర్తనలో వచ్చిన ఈ పెద్ద మార్పును తనకంటే ముందుగా తన భార్యే గుర్తించిందని మాధవన్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఆ పరిస్థితి నుంచి బయటపడి వరుస సినిమాలతో బిజీ అయ్యానని పేర్కొన్నారు.






