తెలుగులో నా క్ర‌ష్ అత‌నే..మాళ‌విక బోల్డ్ కామెంట్స్‌

by velandi.Saikiran |   (  Updated:2026-01-05 05:09:40  IST  )

తెలుగులో తన క్రష్ ప్రభాస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ మాళవిక మోహన‌న్. అతడు అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొంది.

తెలుగులో నా క్ర‌ష్ అత‌నే..మాళ‌విక బోల్డ్ కామెంట్స్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: తెలుగులో తన క్రష్ ప్రభాస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ మాళవిక మోహన‌న్. అతడు అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొంది. హీరో ప్రభాస్ లేటెస్ట్ గా నటించిన సినిమా ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. జనవరి 9వ తేదీన రిలీజ్ కాబోతున్న ది రాజా సాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇందులో మాళవిక మోహనన్ కూడా ఉన్నారు. హారర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో హీరోయిన్ మాళవిక బిజీగా ఉన్నారు.

ఇందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ మాళవిక, ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తన క్రష్ ప్రభాస్ అంటూ వ్యాఖ్యానించారు. బాహుబలి సినిమా చూసిన తర్వాత ప్రభాస్ కు ఫ్యాన్ అయిపోయానని వెల్లడించారు. ది రాజా సాబ్ సినిమా షూటింగ్ సమయంలో అతని బిహేవియర్ చాలా బాగా నచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్ బిర్యానీ కూడా తనకు తినిపించాడని మాళవిక వివరించారు. దీంతో హీరోయిన్ మాళవిక చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Read More..

చీరలో బోల్డ్ షో చేసిన టాలీవుడ్ హీరోయిన్.. టాలెంట్ చూపిస్తున్నావా అంటూ నెటిజన్ల కామెంట్స్

Next Story