పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యాను ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను.. రామ్ చరణ్ హీరోయిన్ సంచలన కామెంట్స్

by I. Sairam |   (  Updated:2025-05-11 08:00:14  IST  )

‘మైనా’(Maina) మూవీతో ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైన అమలాపాల్(Amala Paul) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యాను ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను.. రామ్ చరణ్ హీరోయిన్ సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మైనా’(Maina) మూవీతో ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైన అమలాపాల్(Amala Paul) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ చిత్రంలో తన నటనకు గాను తమిళనాడు రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు కూడా ఇచ్చింది. అలాగే తెలుగులో ‘ఇద్దరమ్మాయిలతో’(Iddarammayilatho), ‘నాయక్’(Nayak) వంటి చిత్రాలతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం(Tamil), మలయాళం(Malayalam), కన్నడ(Kannada), హిందీ(Hindi) చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. 2014లో తమిళ దర్శకుడు విజయ్‌ను వివాహం చేసుకోగా మూడేళ్లకే మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మళ్లీ 2023లో జగత్ దేశాయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా వీరికి ఇలాయ్ అనే మగబిడ్డ కూడా జన్మించాడు. ఇదిలా ఉంటే.. తాజాగా నిర్వహించిన జేఎఫ్ డబ్ల్యూ మూవీ అవార్డు వేడుకలో ఉత్తమ నటిగా(క్రిటిక్స్) అమలాపాల్ అవార్డ్ గెలుచుకుంది. ఈ సందర్భంగా ఈ ముద్దగుమ్మ జగత్ దేశాయ్‌తో తన ప్రేమ, పెళ్లి ఎలా జరిగిందనే విషయాల్ని బయట పెట్టింది.

ఆమె మాట్లాడుతూ.. ‘జగత్-నేను గోవాలో కలిశాం. అతడు గుజరాతీ కానీ గోవాలోనే సెటిలయ్యాడు. నాది కేరళ అని చెప్పాను. అతడు దక్షిణాది సినిమాలు పెద్దగా చూడడు. నేను కూడా హీరోయిన్ అనే విషయాన్ని కూడా చెప్పలేదు. తర్వాత కొన్నాళ్లకు నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత నేను హీరోయిన్ అన్న విషయాన్ని జగత్‌తో చెప్పాను. ఆ తర్వాత నేను గర్భంతో ఇంట్లో ఉన్నప్పుడు నా సినిమాలని ఒక్కొక్కటిగా చూస్తూ ఎంజాయ్ చేశాడు. నేను అవార్డ్స్ తీసుకున్న ఫొటోలు, వీడియోలు చూసి తెగ మురిసిపోయాడు’ అని అమలాపాల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story