- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్యాప్ ఇచ్చాను.. ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి
హీరో వడ్డే నవీన్ చాలా నుంచి ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. పదేళ్ల విరామం అనంతరం ఇప్పుడు మళ్లీ వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తున్నాడు

దిశ, సినిమా: ‘పెళ్లి’, ‘మనసిచ్చి చూడు’ లాంటి ఎన్నో చిత్రాలతో క్లాసికల్ హిట్ అందుకున్న హీరో వడ్డే నవీన్.. చాలా నుంచి ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. దాదాపు పదేళ్ల విరామం అనంతరం ఇప్పుడు మళ్లీ వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు కమల్ తేజ నార్ల దర్శకత్వం వహిస్తున్నాడు. రాశీ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకోగా.. తాజాగా టీజర్ లాంచ్ చేశారు టీమ్. ఇందులో భాగంగా తనకు వచ్చిన గ్యాప్‌పై ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
‘ఫస్ట్ నేను సినిమా చేయాలి అనుకోలేదు. ఇప్పుడు యాంకర్ కూడా అడిగారు.. ‘బ్రేక్ ఇచ్చారా.. వచ్చిందా అని’ రెండు జరిగాయి. అసలు నాకు బ్రేక్ ఎలా వచ్చింది అంటే.. మంచి సినిమాలు, నాకు నచ్చిన సినిమాలు రాలేదు. వచ్చిన సినిమాలు నేను చేయలేదు. అలా రెండు విధాలుగా నాకు బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత చాలా మంది నాకు కథలు వినిపించారు. నేను కూడా రీ ఎంట్రీ కోసం 5సంవత్సరాల నుంచి చాలా కథలు విన్నాను. అన్నీ బాగున్నాయి కానీ నేను అనుకున్న స్టైల్లో కుదరలేదు అని చెప్పుకొచ్చారు వడ్డే నవీన్.






