- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నపిల్లను కొట్టేటప్పుడు చాలా బాధగా అనిపించింది.. రవి కాలే ఎమోషనల్ కామెంట్స్
క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవి కాలే(Ravi Kale) గురించి మనందరికీ సుపరిచితమే. ఎన్నో సినిమాల్లో తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాడు.

దిశ, వెబ్‌డెస్క్: క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవి కాలే(Ravi Kale) గురించి మనందరికీ సుపరిచితమే. ఎన్నో సినిమాల్లో తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాడు. మెయిన్‌గా విలన్ క్యారెక్టర్స్ చేస్తూ అలరించాడు. అలా ఎన్నో సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే వెంకటేష్(Venkatesh) నటించిన ‘దృశ్యం’(Drishyam) సినిమాలో ఇతని యాక్టింగ్‌కు చాలా మంది ఫ్యాన్ అయిపోయారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి కాలే ఆ సినిమాలోని వీరభద్ర(Veerabhadra) పాత్ర గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
ఆయన మాట్లాడుతూ.. ‘వీరభద్ర పాత్ర నాకు ఎంతో ప్రత్యేకమైనది. ఆ పాత్ర ఒక స్లో పాయిజన్ లాగా నెమ్మదిగా మొదలై, చివరికి భయంకరంగా మారుతుంది. చిన్న పాపను కొట్టే సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు నటుడిగా నటించినా, వ్యక్తిగతంగా ఎంతో బాధ పడ్డాను. ఆ సన్నివేశంలో వెంకటేష్, ఆయన భార్య, చివరికి ఆ పాపను కూడా హింసించిన తీరు ప్రేక్షకులను తీవ్రంగా ప్రభావితం చేసింది. థియేటర్లలో నా పాత్రను చూసి ప్రేక్షకులు తిట్టినప్పుడు, అది నా నటనకు లభించిన అవార్డుగా భావించాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






