నేను ఆ హీరోతో పని చేయడం చాలా కంఫర్ట్‌గా ఫీల్ అవుతాను.. కృతి శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2025-12-09 15:43:57  IST  )

‘ఉప్పెన'(Uppena) మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ రేంజ్‌కి మారిపోయిన కృతి శెట్టి(Krithi Shetty) గురించి మనం ఎంత చెప్పినా తక్కువే.

నేను ఆ హీరోతో పని చేయడం చాలా కంఫర్ట్‌గా ఫీల్ అవుతాను.. కృతి శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఉప్పెన'(Uppena) మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ రేంజ్‌కి మారిపోయిన కృతి శెట్టి(Krithi Shetty) గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఫస్ట్ మూవీతోనే తెలుగు ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టేసింది. దీంతో ఈ భామ గ్రాఫ్ చేంజ్ అయిపోతుంది అని అందరూ అనుకున్నారు. అయితే అవకాశాలు బానే వచ్చినప్పటికీ ఆ సినిమాలు అంతగా మెప్పించలేక పోయాయి. దీంతో ఈ భామ రేంజ్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. ప్రస్తుతం ఈ చిన్నది ‘వా వాతియార్’ సినిమాలో యాక్ట్ చేస్తుంది.

ఇక ఇందులో కార్తి(karthi) హీరోగా నటిస్తున్నాడు. నలన్ కుమారస్వామి (Nalan Kumaraswamy)దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఈ చిన్నది వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొనగా.. ఆమెను మీరు పనిచేసిన కో స్టార్స్‌లో ఎక్కువగా మీకు కంఫర్టబుల్‌గా అనిపించిన హీరో ఎవరు అని అడిగారు.

దీనికి ఆమె స్పందిస్తూ.. ‘"నాగచైతన్య గారితో పని చేయడం నాకు చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. ఎందుకంటే ఆయన చాలా నిజాయితీపరుడు, నాలాగే ఉంటారు. నాకు ఎప్పుడైనా సలహా అవసరమైతే, నేను అతన్నే అడుగుతాను. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఎలాంటి ఫిల్టర్లు లేకుండా నిజాయితీగా ఉంటారని నాకు తెలుసు కాబట్టి" అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Click For Tweet .....

Next Story