- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జిమ్‌కి వెళ్లకుండా ఆ ఒక్క పని చేసి బరువు తగ్గాను.. స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
స్టార్ హీరోయిన్ విద్యా బాలన్(Vidhya Balan) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ విద్యా బాలన్(Vidhya Balan) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘డర్టీ పిక్చర్’(Dirty Picture) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇక ఈ మూవీ తర్వాత బాలకృష్ణ(Balakrishna) నటించిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’(NTR Mahanayakudu) చిత్రంలోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు బరువు తగ్గడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నేను నా కెరీర్ బిగినింగ్‌లో చాలా లావుగా ఉన్నావ్.. ఫిట్‌గా లేవు అనే విమర్శలు ఎదుర్కొన్నాను.
జిమ్‌కు వెళ్లినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత ఓ ప్రముఖ న్యూట్రిషన్ గ్రూప్ సంప్రదిస్తే నేను లావు అయ్యింది ఫాట్ వల్ల కాదు అని తెలిసింది. ఇన్‌ఫ్లమేషన్ కారణంగా నేను బరువు పెరిగాను అని తెలిసింది. దీంతో ఆ న్యూట్రిషన్ గ్రూప్ సలహాలు పాటించి బరువు తగ్గాను. వ్యాయామం లేకుండా కేవలం డైటింగ్ ద్వారా బరువు తగ్గాను. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది’ అని తెలిపింది విద్య. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






