డబ్బులు లేక రోడ్ల మీద అలా చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్

by Gugulothu.Kavitha |

తెలుగులో మాస్ మహారాజ రవితేజ(RAVITEJA) హీరోగా నటించిన ‘క్రాక్’(Krack) సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాస్ లుక్‌లో జయమ్మ అనే పాత్రలో అద్భుతంగా నటించింది వరలక్ష్మీ.

డబ్బులు లేక రోడ్ల మీద అలా చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగులో మాస్ మహారాజ రవితేజ(RAVITEJA) హీరోగా నటించిన ‘క్రాక్’(Krack) సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాస్ లుక్‌లో జయమ్మ అనే పాత్రలో అద్భుతంగా నటించింది వరలక్ష్మీ. ఈ సినిమాతో ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత వరలక్ష్మీకి మంచి క్రేజ్ ఏర్పడింది. బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్స్ అందుకుంటుంది. ఇందులో భాగంగా ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూర్మ నాయకి’(Kurma Nayaki).

అలాగే టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆనంది(Anandhi), వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarathkumar) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘శివంగి’(shivangi). దీనికి దేవరాజ్ భరణి ధరణ్(Devaraj Bharani Dharan) దర్శకత్వం వహిస్తున్నారు. ఇక శివంగి సినిమాను ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్‌పై సురేష్ బాబు(Suresh Babu) నిర్మించారు. అయితే పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌గా రాబోతున్న ఈ మూవీలో డాక్టర్ కోయి కిషోర్, జాన్ విజయ్(John Vijay) కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రానికి కాషిఫ్ ఎబినేజర్ పాల్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘మీతో నేను ఒక విషయం పంచుకోవాలని అనుకుంటున్నాను. సినిమాల్లోకి రాకముందు నేను మొట్టమొదటిసారి ఒక ప్రముఖ షో కోసం రోడ్డు మీద డ్యాన్స్ వేయాల్సి వచ్చింది. అందుకే నాకు వారు రూ.2500 ఇచ్చారు. అలాంటి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. కాబట్టి ఎన్నడూ కూడా రోడ్డు మీద డ్యాన్స్ చేయడం తప్పుగా భావించవద్దు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుంది.


Next Story