- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ram Gopal Varma: వారికి ద్రోహం చేసిన అపరాధ భావంతో ఏడ్చా.. రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ నోట్
టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తెరకెక్కించిన ‘సత్య’(Satya) 1998లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తెరకెక్కించిన ‘సత్య’(Satya) 1998లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. మళ్లీ 27 ఏళ్ల తర్వాత ఈ మూవీ మరోసారి థియేటర్స్‌లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో.. వర్మ ఎమోషనల్(Emotional) అవుతూ Xద్వారా ఓ నోట్ షేర్ చేశారు. ‘‘ఒక సినిమా తీయడమంటే బిడ్డకు జన్మనివ్వడంలాంటిదే. ముక్కలు ముక్కలుగా చిత్రీకరిస్తూ ఉంటాం. కాబట్టి ఫైనల్ అవుట్‌పుట్ ఎలా వస్తుందనేది తెలియదు.
షూటింగ్ అయ్యాక దాన్ని చూసినవాళ్లు ఇది హిట్టనో, ఫట్టనో అంటారు. నేను మాత్రం సృష్టించిన అందాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన నా సినిమాను లక్ష్యం లేని నా ప్రయాణంలో ఓ అడుగుగా మాత్రమే భావించారు. రెండు రోజుల క్రితం వరకూ అదే అభిప్రాయంతో ఉన్నాను. నేను సత్య మూవీలోని విషాదం చూసి చలించిపోలేదు. నన్ను నేను చూసుకుని ఏడ్చాను. నన్ను నమ్మిన వారందరికీ చేసిన ద్రోహాన్ని తలుచుకుని అపరాధ భావనతో కుమిలిపోయాను. సక్సెస్, అహంకారం తలకెక్కించుకుని తాగుబోతునయ్యాను.
రంగీలా, సత్య హిట్ అవడంతో నా కళ్లు నెత్తికెక్కాయి. అప్పుడే నా విజన్‌ను కోల్పోయాను. ఎలాగో ఆ తప్పులను సరిదిద్దుకోలేను. కాబట్టి దర్శకుడిగా మొదటి స్థానంలో నిలబెట్టే సినిమాలే తీస్తాను. రెండు రోజుల క్రితం నా కన్నీళ్లు తుడుచుకుంటూ నాకు నేను ఇచ్చుకున్న మాట ఇది. ‘సత్య’ లాంటి సినిమా తీయలేకపోయినా.. అలాంటి మీ ముందుకు తేవాలనే ఆలోచన కూడా క్షమించరాని నేరం. దీనర్థం నేను ‘సత్య’ లాంటి చిత్రాలు తీస్తానని కాదు. ఇందులో చూపించిన నిజాయితీ ఇక మీదట ప్రతి మూవీలో చూపిస్తాను. విలువైన సినిమాలే అందిస్తానని మాటిస్తున్నా’’ అని రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు వర్మ కొత్త వెర్షన్ చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
A SATYA CONFESSION TO MYSELF
— Ram Gopal Varma (@RGVzoomin) January 20, 2025
—— Ram Gopal Varma
By the time SATYA was rolling to an end , while watching it 2 days back for 1st time after 27 yrs, I started choking with tears rolling down my cheeks and I dint care if anyone would see
The tears were not…






