- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ స్టార్ హీరో నా సినిమా చేయను అని చెప్పేసరికి తట్టుకోలేకపోయా.. డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్
డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్(Gautam Vasudev Menon) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

దిశ, సినిమా: డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్(Gautam Vasudev Menon) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఆయన ‘ఏ మాయ చేసావే’(Ye Maaya Chesave) సినిమాతో హిట్ అందుకుని మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వెంకటేష్, అసిన్‌తో ‘ఘర్షణ’(Gharshana) సినిమా చేసి తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయారు. ఇక 2022 తర్వాత నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల చియాన్ విక్రమ్(Chiyaan Vikram) నటించిన ‘ధృవ నక్షత్రం’(Dhruva Nakshatram) సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే 2019లో ఈ చిత్రం పూర్తి అయినప్పటికీ విడుదల కాలేదు. పలు కారణాల వల్ల రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలో.. తాజాగా, గౌతమ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
“ధృవ నక్షత్రం కథను ముందుగా వేరే హీరోలకు చెప్పాను. కానీ కొన్ని కారణాలతో అందరూ రిజెక్ట్ చేశారు. వారి అభిప్రాయాలను నేను అర్థం చేసుకున్నాను.. అందుకే నాకేం బాధ అనిపించలేదు. కానీ ఈ కథను హీరో సూర్య(Surya) సైతం నో చెప్పాడు. ఆ మాటను తట్టుకోలేకపోయాను. సూర్య నో చెప్పడం నన్ను ఎంతోగానో బాధించింది. అలాగే ‘ధృవ నక్షత్రం’ సినిమా విడుదల కోసం ఎంతో ప్రయత్నిస్తున్నాను. తప్పకుండా ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తాము.
ఈ మూవీ ప్రేక్షకులకు అస్సలు బోర్ కొట్టదు, ఇప్పటితరం ఆడియన్స్ కచ్చితంగా ఈ చిత్రాన్ని ఇష్టపడతారు. దాదాపు 12 ఏళ్ల క్రితం తెరకెక్కించిన ‘మద గజ రాజా’(Madha gaja Raja) సినిమా ఇప్పుడు విడుదలై సక్సెస్ కావడం ఆనందంగా ఉంది. అలాగే ధృవ నక్షత్రం సినిమా సైతం మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నాను” అని గౌతమ్ మీనన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






