- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sai Pallavi: అదే గొప్ప విజయంగా భావిస్తాను.. అవార్డులపై సాయి పల్లవి కీలక వ్యాఖ్యలు!
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi) ఇటీవల ‘తండేల్’(Thandel) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi) ఇటీవల ‘తండేల్’(Thandel) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగచైతన్య(Naga Chaitanya) హీరోగా నటించిన ఈ చిత్రాన్ని చందూ మొండేటి(Chandoo Mondeti) తెరకెక్కించారు. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్స్‌లోకి వచ్చి హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సాయి పల్లవి వరుస చిత్రాల్లో నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధిస్తూ దూసుకుపోతుంది. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘రామాయణ’. రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) రాముడిగా నటిస్తుండగా.. కన్నడ స్టార్ యశ్ రావణుడిగా కనిపించబోతున్నాడు. నితేష్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. ఇందులో బాబీ డియోల్ ( Bobby Deol)హనుమంతుడి పాత్రలో నటిస్తున్నాడు. అయితే రెండు పార్టులుగా రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కాబోతుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నేను నా పాత్రను ఎంపిక చేసుకునేటప్పుడు కథలో లోతెంత ఉందనేది చూస్తాను. నా పాత్రకు బలమైన భావోద్వేగం ఉందా? లేదా అని చెక్ చేస్తాను. ప్రేక్షకులకు నిజాయితీ గల కథలు చెప్పాలని తపన పడుతుంటాను. నా పాత్ర తాలూకు భావోద్వేగాలతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారంటే అదే గొప్ప విజయంగా భావిస్తాను. అందుకే నేనెప్పుడూ అవార్డుల కన్నా ప్రేక్షకుల ప్రేమను గెలుచుకోవడానికి తొలి ప్రాధాన్యత ఇస్తా. ‘రామాయణ’ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తుండటం సంతోషంగా ఉంది. సీత పాత్రలో నటించడం గౌరవంగా ఉంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Tags
- Sai Pallavi






