- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దయచేసి తప్పుడు వార్తలు సృష్టించొద్దు.. నేను ఓ సమస్యతో బాధపడుతున్నా.. పవిత్ర ఎమోషనల్ పోస్ట్
యంగ్ హీరోయిన్ పవిత్ర లక్ష్మి(Pavithra Lakshmi) ‘ఓ కాదల్ కన్మణి’ (O Kadhal Kanmani) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ పవిత్ర లక్ష్మి(Pavithra Lakshmi) ‘ఓ కాదల్ కన్మణి’ (O Kadhal Kanmani) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)సరసన నటించిన ఆమె ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన ఆమె ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. చేసింది తక్కుల సినిమాలే అయినప్పటికీ పవిత్రలక్ష్మి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక గత ఏడాది ఈ అమ్మడు ‘వన్స్ అపాన్ టైమ్ ఇన్ మద్రాస్’ సినిమాతో వచ్చి ప్రేక్షకులను అలరించింది. గత కొద్ది రోజుల నుంచి పవిత్ర ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె గురించి పలు పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ప్రాస్టిక్ సర్జరీ చేయించుకుందని దారుణంగా మాట్లాడుతున్నారు. తాజాగా, ఈ విషయంపై పవిత్ర స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
‘‘గత కొద్ది రోజుల నుంచి నా గురించి కొన్ని తప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. నా లుక్ మారడం, బరువు పెరగడం వల్ల నేను సర్జరీ చేయించుకున్నాను అని అంటున్నారు. కొన్ని కామెంట్లు అయితే చెప్పడానికి కూడా వీలులేనంత దారుణంగా ఉన్నాయి. మీ అందరికీ ఓ ముఖ్యమైన విషయం చెప్తున్నాను. కొన్ని రోజుల నుంచి నేను తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాను. అందుకే చికిత్స కూడా తీసుకుంటున్నాను. ప్రస్తుతం దేవుడి దయవల్ల క్షేమంగానే ఉన్నా కానీ నా గురించి దారుణంగా కామెంట్లు చేస్తుండటం చూసి బాధగా అనిపిస్తుంది. నాకంటూ ఓ జీవితం ఉంది. దయచేసి నా పేరు చెడగొట్టకండి.. నా భవిష్యత్తును ఆగం చేయకండి. నా మీ ప్రేమ, గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాను. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను’’ అని రాసుకొచ్చింది. కానీ తనకు ఎమైందనేది వెల్లడించలేదు. ప్రస్తుతం పవిత్ర పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.






