‘ఆ విషయంలో నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది’.. సమంతపై మహానటి ప్రశంసల వర్షం..

by Gugulothu.Kavitha |

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది.

‘ఆ విషయంలో నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది’.. సమంతపై మహానటి ప్రశంసల వర్షం..
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత నటించిన దాదాపు అన్ని సినిమాలు హిట్స్‌గానే నిలిచాయి. ఇక రీసెంట్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీకి ‘బేబీ జాన్’(Baby Jahn) సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేదు. ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్‌(Antony Tattil)తో కలిసి రీసెంట్‌గా ఏడడుగులు వేసింది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి తన భర్తతో మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత(Samantha)కు కీర్తి సర్‌ప్రైజ్ వాయిస్ మెసేజ్ పంపారు. ఇక ఆ మెసెజ్‌లో కీర్తి సురేష్.. ‘సమంత.. నీతో ఉన్న అనుబంధాన్ని ఎలా వర్ణించాలి, ఎక్కడ నుంచి ప్రారంభించాలో తెలియడం లేదు. మనం కలిసింది కొన్ని సార్లే అయినా.. ఎన్నో ఏళ్ల క్రితం నుంచి కలిసి ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఏ విషయంలోనైనా సూటిగా వ్యవహరిస్తావు. మహిళల కోసం ముందుంటావు. నాకు ఎన్నో విషయాల్లో స్ఫూర్తిని ఇస్తుంటావు. నిన్ను ఫ్రెండ్ అనడం కంటే సిస్టర్ అని పిలవడం నాకిష్టం. జీవితంలో ఎదురైన ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నావు. ఇలాంటి పోరాటాలు చేయడం నీకు మాత్రమే సాధ్యం. జీవితం నీకు ఎన్ని సవాళ్లు విసిరినా రెప్పింపు బలంతో వాటిని ఎదుర్కొన్నావు. ఈ విషయంలో నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంటుంది’ అని వాయిస్ మెసేజ్ పంపారు. దీనిపై సమంత కీర్తి సురేష్‌కి థ్యాంక్స్ చెప్పారు.

Next Story