నేను పాన్ సెక్సువల్‌ని.. కోరిక తీర్చుకోవడానికి జెండర్‌తో పనిలేదు.. దుమారం రేపుతున్న ఫిదా బ్యూటీ కామెంట్స్

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ కాంట్రవర్శీ యాక్టర్ గాయత్రి గుప్త(Gayathri Guptha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

నేను పాన్ సెక్సువల్‌ని.. కోరిక తీర్చుకోవడానికి జెండర్‌తో పనిలేదు.. దుమారం రేపుతున్న ఫిదా బ్యూటీ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ కాంట్రవర్శీ యాక్టర్ గాయత్రి గుప్త(Gayathri Guptha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ ‘ఫిదా’(Fidaa), ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’, ‘సీత ఆన్ ది రెడ్’, ‘బుర్రకథ’(Burrakatha) వంటి చిత్రాల్లో లిమిటెడ్ రోల్స్‌లో నటించి మెప్పించింది. ఇక ఈ చిన్నది టాలీవుడ్‌లో ఉండే క్యాస్టింగ్ కౌచ్ గురించి, అలాగే బిగ్ బాస్ షో బాగోతాల పైన నోరు విప్పి హాట్ టాపిక్ అయ్యింది. ఫెమినిజం, పురుషాధిక్యత, వస్త్రధారణ తదితర విషయాల్లో కూడా తన వాయిస్‌ని గట్టిగా వినిపిస్తూ.. ఎవడు ఏమనుకుంటే నాకేంటి? నాకు నచ్చినట్టు నేనుంటా.. తప్పేంటి? అన్న శైలిలో స్పందిస్తుంటుంది. ఈ క్రమంలో ఈ భామ చేసిన బోల్డ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నేను కూడా పాన్ సెక్సువల్’ అని తెలిపింది. పాన్ సెక్సువల్ అంటే ఏ జెండర్ అయినా కోరికలు కలగడం. సాధారణంగా అమ్మాయిలు.. అబ్బాయిలను చూసి ఆకర్షితులు అవుతారు. అబ్బాయిలకు.. అమ్మాయిల మీద కోరికలు పుడతాయి. ఇది సహజం. అయితే ఈ మధ్య కాలంలో అబ్బాయిల మీద, అమ్మాయిలకు అమ్మాయిల మీద కోరికలు పుడుతున్నాయి.

ఒకే జెండర్ వాళ్లే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కానీ గాయత్రి లాంటి పాన్ సెక్సువల్ వాళ్లు జెండర్‌తో సంబంధం లేకుండా ఆడ, మగ,ట్రాన్స్ జెండర్ ఎవరి పైన అయినా ప్రేమ పుడుతుంది. వారితో శ‌ృంగారం చేయగలరు. వారికి ఎవరిని చూసినా కోరిక కలుగుతుంది. అలాంటి వారికి జెండర్ ముఖ్యం కాదు. ఆ వ్యక్తి ఎలాంటి వారు..? ప్రేమను పంచుతున్నారా..? సుఖం అందిస్తున్నారా..? ఇలాంటివే పరిగణనలోకి తీసుకుంటారు. ఇక ఇప్పుడు గాయత్రి చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. Link

Next Story